- Advertisement -
గర్భస్థ పిండానికి గుండె చికిత్స
Heart treatment for the fetus
హైదరాబాద్
తల్లి గర్భంలో ఉన్న పిండానికి గుండె చికిత్స చేసి వైద్య చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు రెయిన్ బో చిల్ట్రన్ హాస్పిటల్ వైద్యులు. హిందూపురంకు మహిళ గర్భంలోని పిండం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు . ప్రపంచంలోనే మొదటి సారిగా 27 వారాల పిండంపై గుండె చికిత్సను విజయవంతం చేసినట్లు డాక్టర్ నాగేశ్వర్ రావు తెలిపారు .అత్యంత క్లిష్టమైన బెలూన్ డిలేటేషన్, లెఫ్ట్ వెంట్రిక్యులర్ డివైస్ క్లోజర్ లతో చికిత్స చేసినట్లు ఆయన వెల్లడించారు.ఆధునిక ఇమేజింగ్ తో కవాటం స్థితిని సవరించి… గుండెకు పడ్డ రంధ్రాన్ని డివైజ్ తో మూసివేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారని డాక్టర్ నాగేశ్వర్ రావు తెలిపారు .పిండం గుండె చికిత్స అందించడంలో సమిష్టి కృషికి ఇది నిదర్శనమన్నారు. పిడియాట్రిక్ కార్డియాక్ సంరక్షణలో అద్భుతమైన మైలురాయిని సాధించామన్నారు .
- Advertisement -