Sunday, September 8, 2024

మేడ్చల్ లో వేడెక్కిన రాజకీయం

- Advertisement -

మేడ్చల్ లో వేడెక్కిన రాజకీయం
హైదరాబాద్, మార్చి 28
మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సంర్భంగా మహిళలపై మరో వర్గం వారు దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలు రావడం రాజకీయంగా బీజేపీకి గొప్ప అవకాశంగా మారింది. బీజేపీ నేతలు వరుసగా చెంగిచెర్లను సందర్శిస్తూండటంతో.. విషయం అంతకంతకూ పెద్దదవుతోంది. మొదట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులను పరామర్శించారు. మహిళలు హోలీ పండుగ చేసుకుంటుంటే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డార ఈ దాడిలో గర్భిణిలతో పాటు మహిళలకు తలలు పగిలి తీవ్రగాయాలయ్యాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. తర్వాత బండి సంజయ్ బుధవారం పిలుపునిచ్చి మరీ చెంగిచెర్ల వెళ్లారు. బండి పిలుపుతో.. పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాసేపు అక్కడి వాతావరణం రణరంగంగా మారింది. పోలీసులు ఎన్ని నిర్భందాలు ఏర్పాటు చేసిన బండి సంజయ్ వాటిని దాటుకుని పోలీసులను తోసుకుని ముందుకు సాగాడు. అనంతరం బండి సంజయ్ ముస్లిం యువకుల దాడిలో గాయపడిన వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే కాలనీ వాసుల పై దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడే వరకు తన పోరాటం ఆగదని బాధితులకు బండి హామీ ఇచ్చారు.బండి సంజయ్ బారికెడ్లను తోసుకుంటూ పోలీసులను గాయపర్చి లోపలికి వెళ్లారని .. తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్ పై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదానికి కొనసాగింపుగా రాజాసింగ్ అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. బండి సంజయ్ బారికెడ్లను తోసుకుంటూ పోలీసులను గాయపర్చి లోపలికి వెళ్లారని .. తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్ పై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, బాధితులకు న్యాయం జరగకుంటే ఎంతవరకైనా పోరాడుతామని కేంద్ర మంత్రి హెచ్చరించారు. తమకు ఎన్నికలు ముఖ్యం కాదని, మహిళలు, పేదల రక్షణ ముఖ్యమని పేర్కొన్నారు. మేడ్చల్‌ జిల్లా చెంగిచెర్లలో హోలీ పండగ సందర్భంగా హోలీ అడుకుంటున్న మహిళలపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనకు మత రాజకీయాలు తోడయ్యాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్