శ్రీశైలానికి భారీ వరద..
Heavy flood in Srisailam..
ఎగువ నుంచి మరో 5 రోజుల పాటు..
హెచ్చరించిన కేంద్ర జల సంఘం
సాగర్‌లో రెండో రోజూ గేట్లు ఓపెన్
రాష్ట్రంలో నేడు, రేపు అతి భారీ వర్షాలు
హైదరాబాద్:
కృష్ణా పరివాహక ప్రధాన జలాశయాలన్నీ ఆకస్మిక భారీ వరదలతో ఉప్పొంగుతున్నాయి. ఎగువన ఆలమట్టి నుంచి శ్రీశైలం జలాశయానికి భారీ ప్రవాహం వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్, పులిచింతల గరిష్ఠ మట్టానికి చేరాయి. ఆలమట్టిలో 129.72 టీఎంసీలకు గాను 122.1 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 1,66,760 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంటే.. కేంద్ర జల సంఘం హెచ్చరికల నేపథ్యంలో 1,76,540 క్యూసెక్కులను కిందకు వదిలేస్తున్నారు.
నాగార్జున సాగర్‌లోనూ వరుసగా రెండోరోజు మొత్తం 26 గేట్లనూ ఎత్తి ఉంచారు. ఎగువ నుంచి మరో ఐదు రోజులు భారీ వరద రానుందని కేంద్ర జల సంఘం అప్రమత్తం చేసింది. తుంగభద్ర నుంచి కూడా భారీగా వరద వస్తే పెను నష్టం సంభవిస్తుందని.. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహ వేగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపట్టకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.