- Advertisement -
భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా 33 మంది బలి.
Heavy rains and floods killed 33 people across the state.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా 33 మంది బలయ్యారు. ఖమ్మంలో అరుగురు , కొత్తగూడెంలో ఐదుగురు, ములుగులో నలుగురు ,కామారెడ్డి మరియు వనపర్తిలో ముగ్గురు చనిపోయారని మంత్రి పొంగులేటి వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. 358 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని వరద బాధితుల కోసం 158 పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశామని తెలిపారు. ముందస్తు చర్యల వల్ల 2,454 మందిని రక్షించగా 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -