నేపాల్ లో భారీ వర్షాలు.. వరదలు,

- Advertisement -

నేపాల్ లో భారీ వర్షాలు.. వరదలు,
కొండ చరియలు విరిగిపడి 14మంది మృతి
ఖట్మాండు
నేపాల్లో రుతుపవనాల రాకతో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పిడుగుల వర్షానికి తోడు వరదలు బీభత్సం సృష్టించాయి. ఆ దేశవ్యాప్తంగా 24 గంటల్లో 14 మంది మరణించారు.
ఈ వర్షాల వల్ల చాలాచోట్ల కరెంట్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఇక ఇప్పటివరకు కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు, వరదల కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క్ లామ్జంగ్లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందడంతో అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించాయి. జూన్ 26, 2024న రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుండి, మొత్తం 28 మంది మరణించినట్లు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ రికార్డులు చెబుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular