ప్రాణాలకు తెగించి నీటి అడుగు నుండి ఇసుకను తీస్తున్న శ్రామికులు
నిర్మల్ జిల్లా బ్యూరో వాయిస్ టుడే ప్రతినిధి డిసెంబర్ 17: నిర్మల్ జిల్లా NH 224 రహదారికి ఆనుకుని ఉన్న చిట్యాల వాగు సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న దళారులు. మనిషి మునిగేంత లోతులో నుండి ఇసుకను తేప్పల సహాయంతో. తాడును కట్టి లాగుతూ ఒడ్డుకు చేర్చి ఇసుకను ట్రాక్టర్ల సహాయంతో తరలిస్తున్నారు. ప్రాణులకు తెగించి శ్రామికులు రోజువారి కూలీలు ఈ పనికి వస్తున్నారు. ప్రమాదం అని తెలిసినప్పటికీ పొట్టకూటికోసం వస్తున్నామని తెలిపారు. నిత్యం వందలాది వాహనాలు బైంసా నిర్మల్ వైపు ప్రయాణిస్తూ ఉంటాయి అయినప్పటికీ ఎవరు ఏమి చేయలేరన్న ధైర్యంతో అక్రమార్కులు నిత్యం టక్టర్ల సహాయంతో నిర్మల్ పట్టణానికి ఇసుకను తరలిస్తున్నారు. వాగు నుండి ఇసుకను ఇష్టం వచ్చినట్టు తీసుకొని అధిక ధరలకు అమ్ముకుంటూ ప్రభుత్వ ఆదాహానికి గండి కొడుతున్నారు ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం పోలీస్ శాఖ రెవెన్యూ మైనింగ్ శాఖలు అటువైపు వచ్చి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అటువైపుగా బస్సులో నుండి చూసే ప్రయాణికులు ప్రమాదం అని తెలిసినప్పటికీ ఇంత ఘోరంగా ఇసుకను ఎలా తీస్తున్నారని వాపోతున్నారు

మత్తు వీడని అధికారులు
అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుంది. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేస్తే తప్ప అక్రమార్కుల గుండెల్లో భయం పుట్టేలా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకోవడం మూలంగానే అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ఇప్పటికైనా అధికార యంత్రాంగం వీటిపై దృష్టి సారించి అక్రమాలకు పాల్పడిన టక్టర్లను యాజమాన్యాలను అదుపులోకి తీసుకొని ఇలాంటివి జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు



