హలో మాల చలో అసెంబ్లీ
Hello Mala Chalo Assemblyమాల నాయకుల ముందస్తు అరెస్ట్
కోరుట్ల
హలో మాల చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్ళనున్న మాల సంఘ నాయకులను జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ, మండల నాయకులను కోరుట్ల పోలీసులు ముందస్తుగా గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వర్గీకరణను ముందుకు తీసుకు వస్తుందని ఆరోపించారు. పార్లమెంటులో ఆమోదం తెలిపితే వర్గీకరణ జరగదని రాష్ట్రాల తో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎస్సీ వర్గీకరణ జరగదని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. బిజెపి ఓట్ల రాజకీయంతో ఎస్సీల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు బలిజ రాజారెడ్డి, దుంపల రాజనర్సయ్య, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, భూపెల్లి నగేష్ ,మాల సంఘ పట్టణ అధ్యక్షుడు పొట్ట లక్ష్మణ్, సామ ల వేణుగోపాల్, గంగారెడ్డి, రాజశేఖర్, శంకర్ రాజేందర్, మురళి, శేఖర్, సురేష్, లింగం తదితరులు ఉన్నారు.



