20 C
New York
Tuesday, May 28, 2024

వియ్యంకుని ఎన్నికల ప్రచారానికి రానున్న హీరో వెంకటేష్

- Advertisement -

ఈనెల 7న ఎన్నికల ప్రచారానికి రానున్న హీరో వెంకటేష్
ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం..
నేడు ప్రచారంలో పాల్గొన్న హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత, కొడుకు అర్జున్ రెడ్డి, మరో కోడలు స్వప్ని రెడ్డి
ఖమ్మం
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత,కొడుకు అర్జున్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయ స్వప్ని రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం, కమలాపురం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి రామ సహాయం రఘురాం రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత మాట్లాడుతూ ఈనెల 7న తన మామయ్య రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ తన తండ్రి వెంకటేష్ ప్రచారానికి రానున్నట్లు ఆమె తెలిపారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!