22.1 C
New York
Friday, May 31, 2024

హీరో విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్

- Advertisement -

హీరో విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, టాలెంటెడ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ చిత్రమిది. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది.
ఈ రోజు విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాను ప్రకటించారు. అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ కత్తి పట్టుకుని, వయలెంట్ మోడ్ లో ఉన్నట్లు చూపించారు. ‘కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే..’ అనే క్యాప్షన్ రాశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు తెలియజేయనున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!