సీక్రెట్ గా హీరోయిన్ ఎంగేజ్మెంట్..
Heroine engagement as a secret..టాలీవుడ్ హీరోయిన్ మేఘ ఆకాష్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకుడిగా రూపొందిన ‘లై’ సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత కూడా నితిన్ హీరోగా చల్ మోహన్ రంగా సినిమాలో నటించింది. తర్వాత పలు తమిళ్, హిందీ సినిమాలో నటించిన ఈ అమ్మడు మళ్లీ తెలుగులో రాజరాజ చోరా సినిమాలో నటించింది.
ఇలా ఎన్నో పెద్ద సినిమాలు చేస్తున్న ఈ బామ్మ కొన్నాళ్లకు సినిమాలకు దూరంగా ఉంటున్నందున ఈమెపై పెళ్లి వార్తలు వైరల్ గా మారాయి. గత కొన్ని నెలలుగా మెగా ఆకాష్ డేటింగ్ లో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. ఇలాగే ఎన్నో రూమర్లు వచ్చిన ఈమె వాటిపై నోరు విప్పలేదు. అయితే తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు సాయి విష్ణు తో ప్రేమలో ఉన్నట్లు అతడినే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ముమ్మాటికి నిజం చేస్తూ సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది ఈ అమ్మడు. తాజాగా హీరోయిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
మేఘ ఆకాశ్ తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది కానీ సరైన బ్రేక్ రాలేదు. తెలుగులోనే ఛల్ ‘మోహన రంగ’, ‘రాజరాజ చోర’, ‘డియర్ మేఘ’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘ప్రేమదేశం’, ‘రావణాసుర’, ‘బూ’, ‘మనుచరిత్ర’ మూవీస్ చేసింది. తమిళంలోనూ రజనీకాంత్ ‘పేటా’తో పాటు బోలెడన్ని చిత్రాల్లో నటించింది. కాకపోతే ఈమెకు సరైన పెద్ద హిట్ పడలేదు.
తమిళ్ తో పాటు తెలుగు, హిందీ సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీ బిజీగా ఉన్న మేఘా ఆకాష్ సడెన్ గా తన నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసేసరికి అందరు సర్ప్రైజ్ అయ్యారు… మేఘ ఆకాశ్ మాటల్లో……నా కోరిక తీరింది, గతంలో ఎప్పుడు లేనంత సంతోషంగా, ప్రేమతో ఉన్నాను. నా లవ్ లైఫ్ తో నిశ్చితార్థం అయినందుకు సంతోషంగా ఉందంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేసింది. మేఘా ఆకాష్ గత ఏడాది ఏకంగా ఏడు సినిమాల్లో నటించింది. ఈ ఏడాదికి కూడా మూడు నాలుగు సినిమాలు కూడా చేస్తుండటం కొసమెరుపు.




