Sunday, September 8, 2024

హే.. రమణ దీక్షితులు…

- Advertisement -

మార్పు ఎందుకో…

తిరుమల, నవంబర్ 29, (వాయిస్ టుడే):  తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులకు మరోసారి కోపం వచ్చింది. టీటీడీ ప్రధాన అధికారి తో పాటు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయాలని చూడడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన ఆయన కొద్దిసేపటికే తొలగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చర్చనీయాంశంగా మారింది.2019 ఎన్నికలకు ముందు రమణ దీక్షితులు తిరుమలలో ప్రధాన అర్చకుడుగా ఉండేవారు. కానీ అప్పటి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పింక్ డైమండ్ చోరీకి గురైందని, కోర్టులో తవ్వకాలు జరిగాయని ఏకంగా మీడియా సమావేశాలు పెట్టి మరి టిడిపి ప్రభుత్వం పై ఆరోపించారు. దీంతో అప్పటి ప్రభుత్వం అర్చక వృత్తి నుంచి రమణ దీక్షితులకు రిటైర్మెంట్ ప్రకటించింది.దీంతో ఆయన జగన్ కు దగ్గరయ్యారు. సొంత మనిషిగా మారిపోయారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు నేను చూసుకుంటాను అన్న రేంజ్ లో జగన్ హామీ ఇచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా రమణ దీక్షితులు ఆశించిన పదవి లభించలేదు. టీటీడీ వర్గాల్లో గౌరవం దక్కడం లేదు. దీంతో తన ఆక్రోశాన్ని జగన్ పై చూపే ప్రయత్నం చేస్తున్నారు.ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు ఎక్స్ లో ట్వీట్ చేశారు. “భారత ప్రధానికి శుభోదయం. తిరుమల శ్రీవారి ఆలయ పరిపాలనను హిందూయేతర అధికారి, రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా నాశనం చేస్తోంది. సనాతన ఆచారాలు, టీటీడీ పరిధిలోని పురాతన నిర్మాణాలు వంశం సాగుతోంది. వాటి నుంచి రక్షించి తిరుమలను హిందూ రాష్ట్రంగా అత్యవసరంగా ప్రకటించాలి శ్రీవారి ఆశీస్సులు మీకు ఉంటాయి” అంటూ ట్విట్ చేశారు. దీనిపై జగనన్న వారియర్స్ సభ్యులు ప్రతిదాడికి దిగారు. ముందుగా రమణ దీక్షితులు పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రీ ట్విట్ చేశారు. కొంతసేపటికి రమణ దీక్షితులు తన తొలగించారు. గతంలో సైతం ఇదే తరహా ట్వీట్లతో రమణ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలోని వంశపారంపర్య అర్చకుల శాశ్విత నియామకంపై ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. టిటిడి అర్చకులు, భక్తుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అధ్యయనం చేసిన మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కమిటీ నుంచి నివేదిక అందిన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో రమణ దీక్షితుల్లో ఒక రకమైన అసహనం వ్యక్తం అవుతోంది. ఎన్నికల ముంగిట ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మాదిరిగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని నేరుగా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయాలనుకోవడం విశేషం. దీనిపై వైసీపీ వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రమణ దీక్షితులకు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వొద్దని పార్టీ అధినేత జగన్ కు కోరుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్