Sunday, September 8, 2024

అధిక రక్తపోటుపై అప్రమత్తత అవసరం

- Advertisement -
High blood pressure requires vigilance
High blood pressure requires vigilance

హైదరాబాద్
అధిక రక్తపోటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ వైద్య నిపుణులు డా.శ్రీధర్రెడ్డి అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 60 ఏళ్లు దాటిన వారిలో అధిక రక్తపోటు ఉండేదని, ప్రస్తుతం చిన్న వయసు వారిలోనూ ఈ సమస్య కనిపిస్తోందన్నారు. దీనికి ప్రధానంగా మారుతున్న ఆహా రపు అలవాట్లు, లైఫ్ స్టైల్, వంశపారంపర్యంగా వచ్చే బాధితులు ఉన్నట్లు తెలిపారు. అధిక రక్తపోటు ప్రారంభం లో ఉదయాన్నే తలనొప్పి, తల బరువుగా అనిపించడం, కళ్లు మసకబారడం, గుండెదడ తదితర లక్షణాలు కని పిస్తాయన్నారు. ఇటువంటి సమయంలో వైద్యుల సలహా మేరకు మందులు వాడాలన్నారు. అలసత్వం వహిస్తే పక్షవాతం, బ్రైన్ ట్యూమర్, కళ్లు, కిడ్నీ, సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎక్కువ టెన్షన్ తీసుకోవడం తగ్గించు కోవాలని, సమయానుకూలంగా నిద్ర, కొంత సమయం నడక అవసరం అన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక దఫా పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. కుడి చేతికి, ఎడమ చేతికి రక్తపో టులో తేడా ఉండొచ్చని, డిజిటల్ మీటర్లలో రక్తపోటు నివేదికలు ఖచ్చితమైనవి కాకపోవచ్చని ఆరోపించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్