సింగరేణి యాజమాన్యానికి హైకోర్ట్ షాక్
ఎన్నికలపై విచారణ 21కి వాయిదా..
పెద్దపల్లి డిసెంబర్ 18
: సింగరేణి ఎన్నికలపై హైకోర్టు విచారణ 21కి వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఇంధన కార్యదర్శి హైకోర్టులో వేసిన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లకు, సిబ్బంది నియామకానికి మరికొంత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారించాల్సి ఉండగా 21వ తేదీకి వాయిదా వేశారు.కాగా, ఈనెల 27వ తేదీని ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించిన క్రమంలో ఎన్నికలను మార్చికి వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే విషయంలో ఎటు తేలక పోవడంతో కార్మిక సంఘాలు అయోమయానికి గురవుతున్నాయి.
సింగరేణి యాజమాన్యానికి హైకోర్ట్ షాక్
- Advertisement -
- Advertisement -