Sunday, March 23, 2025

హైటెక్ సిటీలో హైలెవల్ అద్దెలు

- Advertisement -

హైటెక్ సిటీలో హైలెవల్ అద్దెలు
హైదరాబాద్ మార్చి 22, (వాయిస్ టుడే )

High-level rentals in Hi-Tech City

హైదరాబాద్‌ మహానగరం విశ్వనగరంగా మార్పు చెందుతోంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ నగరానికి వస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఉద్యోగులు నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. విదేశీయులు కూడా హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగాలు చేస్తుండటం గమనార్హం. అందులోనూ ఐటీ రంగం రోజు రోజుకు అమాంతంగా పెరిగిపోతుండటంతో.. నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. సాధారణంగా దేశంలోని మెట్రో సిటీస్‌తో పోల్చితే.. హైదరాబాద్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్త తక్కువే అని గతంలో చెప్పేవాళ్లు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో లివింగ్‌ కూడా చాలా కాస్ట్లీగా మారిందనిపిస్తోంది.ఐటీ రంగం పుణ్యమా అని నగరంలోని కొన్ని ప్రాంతాలు యమా కాస్ట్లీగా మారాయి. సామాన్యుడికి ఊహలో కూడా అందనంత.. కనీసం ఊహించనంత ఖరీదుగా ఇండ్ల ధరలు ఉన్నాయి. ఇండ్లు కొనటం అంటుంచితే.. కనీసం రెంట్‌కి ఉండాలన్న లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. ఆయా ప్రాంతాల్లో ఇండ్ల అద్దెనే రూ.4 నుంచి 5 లక్షలుంటుంది. ఇక విల్లాల అద్దెలైతే.. రూ.5 లక్షల పైమాటే. మరి హైదరాబాద్ నగరంలోని ఏఏ ప్రాంతాల్లో ఖరీదైన అద్దెలున్నాయో ఓ లుక్కేద్దాం పదండి..!హైదరాబాద్‌ నగరంలోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని లగ్జరీ అపార్ట్‌మెంట్లు అత్యంత ఖరీదైన అద్దెలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రాంతాల్లోని అత్యంత ఖరీదైన కొన్ని అపార్ట్ మెంట్ల వివరాలు చూద్దాం..
1. జయభేరి ది పీక్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
అద్దె: రూ.4- 4.5 లక్షలు/నెలకు
నర్సింగిలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించబడింది. క్లబ్ హౌస్, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్స్, రూఫ్‌టాప్ స్విమ్మింగ్ పూల్ లాంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
2. ఫార్చ్యూన్ సోంటాలియా స్కై విల్లాస్, కోకాపేట
అద్దె: రూ.3.5-4.5 లక్షలు/నెలకు
6,333-7,333 చదరపు అడుగుల 4BHK స్కై విల్లాలు అందుబాటులో ఉన్నాయి. గండిపేట్ చెరువు అందాలను ఆస్వాదించేందుకు ఇది బెస్ట్ ప్రాపర్టీ.
3. మై హోం భూజా, హైటెక్ సిటీ
అద్దె: గరిష్ఠంగా రూ. 3.2 లక్షలు/నెల
హైటెక్ సిటీలోని ఈ అపార్ట్‌మెంట్ 3, 4, 5BHK అపార్ట్‌మెంట్లతో లగ్జరీ లివింగ్ అనుభూతిని అందిస్తుంది. స్కై లాంజ్, స్విమ్మింగ్ పూల్, స్పా లాంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇక.. అపార్ట్‌మెంట్ల సంగతి అంటుంచితే.. లగ్జరీ విల్లాల అద్దెలు వింటేనే షాక్ కొడుతుంది. మరి లగ్జరీ విల్లాల అద్దెలు ఎలా ఉన్నాయో చూద్దాం..
1. జయభేరి టెంపుల్ ట్రీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
అద్దె: రూ.5-5.8 లక్షలు/నెలు
లగ్జరీ విల్లాలు, ఆధునిక డిజైన్, ఆకర్షణీయమైన గ్రీన్ ల్యాండ్‌స్కేప్‌తో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకమైంది.
2. ఆదిత్య కాసా గ్రాండ్, గండిపేట
అద్దె: రూ.4.5 లక్షల పైమాటే
4, 5BHK విల్లాలు, స్పేషియస్‌ ఇంటీరియర్స్, ప్రీమియం సౌకర్యాలతో టాప్ లగ్జరీ విల్లాల్లో ఇదీ ఒకటి.
3. మై హోం అంకుర్, తెల్లాపూర్
అద్దె: రూ.3.5-4.5 లక్షలు/నెలకు
తెల్లాపూర్‌లో 4BHK విల్లాలు, ఆధునిక సౌకర్యాలు, హై-ఎండ్ లివింగ్ అనుభూతితో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఇది.
కేవలం ఇవే కాకుండా.. నగరంలోని ఆయా ప్రాంతాల్లో వెలిసిన ఆకాశాన్ని తాకే టవర్లలో ఇల్లు కొనటమే కాదు అద్దెకు ఉండటం కూడా చాలా ఖరీదుగా మారింది. లక్షల్లోనే అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్