- Advertisement -
న్యాయవాది మ్యాన మహేష్ కుమార్ కు గౌరవ డాక్టరేట్.
Honorary Doctorate to Advocate Mana Mahesh Kumar.
జగిత్యాల,
జగిత్యాల పట్టణానికి చెందిన న్యాయవాది, సామాజిక సేవకుడు మ్యాన మహేష్ కుమార్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.ఈనెల 28 న సికింద్రాబాద్, లోని సిటీ కల్చరల్ ఆడిటోరియంలో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో, స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ అకాడమీ, స్పూర్తి సకల కళా వేదిక ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ప్రముఖులచే గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు.
మ్యాన మహేష్ కుమార్ “ప్రేరణ ఫౌండేషన్ “ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగిందని నిర్వాహకుడు ఆకుల రమేష్ తెలిపారు. హైకోర్టు న్యాయవాదిగా, రాష్ట్ర యువజన సంఘాల సమైక్య అధ్యక్షులుగా, జగిత్యాల జిల్లా ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షులుగా ఏబీవీపీ, బిజేవైయమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీజేపీ నిర్మల్, మంచిర్యాల జిల్లాల ఇంచార్జి గా పనిచేసి సామాజిక సేవతో పాటు పలు సంఘాలకు బాధ్యులుగా వ్యవహరిస్తున్నందుకు గాను గౌరవ డాక్టరేట్ ను మ్యాన మహేష్ కుమార్ కు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న మ్యాన్ మహేష్ కుమార్ ను న్యాయవాదులు, పట్టణ ప్రముకులు,పలువురు మిత్రులు అభినందించారు.
- Advertisement -