- Advertisement -
కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి
Hotel staff attack customers
వికారాబాద్
పూడూర్ మండలం చిట్టెంపల్లి గేట్ దగ్గర ఉన్న నక్షత్ర హోటల్ యజమాన్యం నిర్వాహకులు కస్టమర్లపై లాఠీలతో దాడి కి దిగారు.
చిట్టెంపల్లి గేటు దగ్గర నక్షత్ర హోటల్ యజమాన్యం పనిచేసే వారంతా కలిసి చేవెళ్ల మండలానికి చెందిన ఘనపురం గ్రామస్తులు ( కస్టమర్లు ) పై ఘోరంగా దాడి చేశారు. బిర్యానీలో పాత్రలు తోమే స్కబ్బర్ (గస్ని ) వచ్చిందని హోటల్లో సిబ్బందిని ని అడగడం జరిగింది. పనిచేసేవారు యజమానులకు చెప్పగా. యజమాని వచ్చి మీరు ఓటల్ కు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమస్య చూపిస్తున్నారు ఏంటి రా.. అని చేవెళ్ల మండలానికి చెందిన ఘనపురం గ్రామస్తులను నక్షత్ర హోటల్ యజమానులు, పనిచేసేవారు వెంటపడి లాటిలు తీసుకొని ఇష్టమొచ్చినట్టుదాడి చేశారని బాధితులు ఆరోపించారు..
- Advertisement -