రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారు?

- Advertisement -

రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారు?

How can Padma award be given to Ghaddar who does not believe in the constitution?

        రాజీవ్‌ను చంపిన వారికి పద్మ పురస్కారం ఇవ్వమంటారా రేవంత్‌?
గద్దర్‌ను ఎల్‌టీటీ ప్రభాకరన్‌, నయీమ్‌తో పోల్చిన విష్ణువర్ధన్‌రెడ్డి..
అమరావతి జనవరి 28 (
తెలంగాణ ఉద్యమ నాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌ను ఎల్‌టీటీ ప్రభాకరన్‌, నయీమ్‌తో పోల్చిన విష్ణువర్ధన్‌రెడ్డి.. రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పురస్కారాలకు తెలంగాణ నుంచి పలువురు ప్రముఖుల పేర్లతోపాటు గద్దర్‌ పేరును కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్స్ చేసింది. కానీ, కేంద్రం మాత్రం.. గద్దర్ తోపాటు ఎవరికీ అవార్డును ప్రకటించలేదు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కార్ సిఫార్స్ చేసిన ఒకరికీ కూడా అవార్డు ఇవ్వకపోవడంతో స్పందించిన సిఎం.. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ లాంటి వాళ్లకు అవార్డు దక్కకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు గద్దర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ మావోయిస్టుకు చెందిన లీడర్ అని, గద్దర్‌ కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నారని, గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలా? అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. రాజీవ్‌ను చంపిన వారికి పద్మ పురస్కారం ఇవ్వమంటారా రేవంత్‌? అని అన్నారు.ఇక, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఆయన భావాజాలం ఏంది?.. ఆయన వల్ల ఎంతో బీజేపీ కార్యకర్తలను నక్సలైట్లు చంపారని.. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఇవ్వమని బండి సంజయ్ స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నాయకులపై కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలతోపాటు తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular