ఫెయిల్యూర్ సర్కారుకు మరో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేము..!
9ఏండ్ల పాలనలో సబ్బండ వర్గాలను మోసం చేసిన కేసీఆర్.
నీరుటి రామ్ ప్రసాద్ పటేల్, రాష్ట్ర అధ్యక్షుడు-NSF.
తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను మోసం చేసి 2సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కి BRS పార్టీ ని నమ్మడానికి సిద్ధంగా లేమని “నవతరం స్టూడెంట్ ఫెడరేషన్(NSF)” రాష్ట్ర అధ్యక్షుడు నీరుటి రామ్ ప్రసాద్ పటేల్ అన్నారు. సోమవారం రోజున జన్నారం మండల కేంద్రంలో నాయకుల సమావేశం లో పాల్గొన్న ఆయన ఈ సంధర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ కారు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు, అసలు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలు ఎన్ని వేసిన నోటిఫికేషన్లు ఎన్ని, భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని అని BRS పార్టీ నాయకులను ప్రశ్నించారు, మన నుండి వేరుపడి ఉన్న పక్క రాష్ట్రం ఆంద్రప్రదేశ్ లో ఇప్పటికే 3 సార్లు దాదాపుగా గ్రూప్ 1పోస్ట్లు భర్తీ చేస్తే ఒక్కటే నోటిఫికేషన్ ని 3సార్లు రద్దు చేసే దౌర్భాగ్యం మన రాష్ట్రంలో ఉంది అని అన్నారు, విద్యార్థులు, నిరుద్యోగులను,రైతులను,కార్మికులను ఇలా సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తున్నాం అంటూనే సబ్బండ వర్గాలను కేసీఆర్ కుటుంబం నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే విధంగా ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధి గురించి స్వయంగా రాష్ట్ర మంత్రి వర్యులు, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు ఈ మధ్య నిర్మల్ లో జరిగిన సభలో మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి జరుగలేదు, తన తమ్ముడు జూన్సన్ నాయక్ ని గేలిపిస్తే అభివృద్ధి చేస్తామని చెప్పడం చాలా అన్యాయం అని, కేవలం నివాళ్ల కోసం ని కుటుంబ సభ్యుల కోసం మాత్రమే నిధులు ఇస్తావా KTR తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి అభివృద్ధి కోసం పక్షపాతం లేకుండా నిధులను కేటాయించే బాధ్యత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీకు లేదా అని ప్రశ్నించారు, రానున్న ఎన్నికల్లో విద్యార్థి,నిరుద్యోగుల పక్షాన ఇంటి ఇంటికి తిరిగి 9ఏండ్ల పాలనలో వారి వైఫల్యాలను ఎత్తి చూపుతూ మరోసారి అధికారంలోకి రాకుండా పోరాడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మహేష్, రంజిత్,వాసు,వంశీ,బాలు తదితరులు పాల్గొన్నారు.



