Saturday, March 28, 2026

రేవంత్‌ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా : జీవన్‌ రెడ్డి

- Advertisement -

 ఎంతమందిని తొక్కుతవ్‌ నువ్వు..
పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదని..
జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదు
రేవంత్‌ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా : జీవన్‌ రెడ్డి
పార్టీ కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల
హైదరాబాద్ మార్చ్ 25

“How many people do you intend to trample? I will stand up to Revanth Reddy and fight back,” declares Jeevan Reddy.
కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే. పార్టీ కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా తన అనుచరులు, మద్దతు దారులతో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదని.. జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదని వాపోయారు.సికింద్రాబాద్‌ ఇంటలెక్చువల్ కానిస్టుయెన్సీయా..? దానం నాగేందర్‌ను అభ్యర్థిగా పెట్టదలచుకుంటే ఆయనను అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండె కదా. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తుతో పోటీ చేసి రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతో కొనసాగుతూ కాంగ్రెస్‌ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడమనేది దేనికి సంకేతమని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌ సీటును కోల్పోయింది. సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయాలతో సీఎం సొంత పార్లమెంట్‌ మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయింది. చేవెళ్ల ఎంపీ స్థానానికి తొలుత సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి.. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డిని తెచ్చి అతనికి ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో సొంత పార్లమెంట్ స్థానం మహబూబ్ నగర్ చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు.
ఎదిరించి పోరాడితే పోయేదేముంది..
రేవంత్‌ రెడ్డిని కూడా ఎదిరించి పోరాటం చేస్తానంటున్న. నీతో అణగదొక్కబడే దానికంటే ఎదిరించి పోరాడితే పోయేదేముంది. మనకు పోయేదేముంది. పోరాడదామా.. వద్దా..? మరిక్కడే అణగదొక్కబడదామా.. ఎంతకాలం ఈ అవమానాలు.. ఎంత కాలం ఈ మానసిక క్షోభ.. అంటే కాంగ్రెస్‌ పార్టీలో ఇంకెవడు ఎదగొద్దు. నీ చెప్పు చేతల్లో ఉండేటోడు. నీ దయాదాక్షిణ్యాలకు లొంగేటోడు. నీ అడుగులకు మడుగులొత్తేటోడు.. వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలే. నిన్ను ఎదురించేటోడు రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అణగదొక్కుతున్నవంటున్నా నేను. ఈ రెండున్నర సంవత్సరాలు నేను పదవి అడగలేదు. ప్రభుత్వ సలహాదారు అడగలే.. కార్పోరేట్‌ చైర్మన్ అడగలే.
నాకు అర్హత లేకనా..?
వేం నరేందర్‌ రెడ్డి ఎవడు..ఆయన పార్టీకి చేసిన సేవ ఏంది..? అని ప్రశ్నించారు. నాకు అర్హత లేకనా..? పోచారం శ్రీనివాస రెడ్డి బతుకచ్చినోడు వాడికేమో ప్రభుత్వ సలహాదారు ఇచ్చినవ్‌.. వాడు ఎవడయా..? ఈ 20 మాసాల్లో పోచారం ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేంటో చెప్పాలని జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. వ్యవసాయ రంగంలో ఏం సలహాలు ఇచ్చావ్‌ నువ్వు.. పోచారంను అడిగారు. నీ అడుగులకు మడుగులు ఎవడైతే ఒత్తుతడో వాడికి పదవులు అని అన్నారు.ముఖ్యమంత్రి ఈ పార్టీ నాది.. నాకెవడైనా ఎవడైనా అడ్డమొస్తే తొక్కుతా అని అంటున్నడు.. ఎంతమందిని తొక్కుతవ్‌ నువ్వు.. అని సీఎం రేవంత్‌ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఇవాళ చెప్తున్న నేను నీ తొక్కుడు కాదు.. జగిత్యాల నియోజకవర్గం నినదించిన నాడు.. అడ్డుపడ్డ నాడు ఏ శక్తి కూడా మమ్మల్ని ఆపరేదని హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్