Sunday, September 8, 2024

హెచ్ పీఎస్.. వందేళ్ల విద్యా సుగంధం.. మరో వందేళ్లు పరిమళం

- Advertisement -

HPS.. Hundred years of education fragrance.. Another hundred years of perfume

(వాయిస్ టుడే-హైదరాబాద్)
ఒక వ్యాపార సంస్థ వందేళ్లు మనగలిగితే అద్భుతం.. ఒక రాజకీయ పార్టీ వందేళ్లు నిలిస్తే చరిత్ర.. ఒక వ్యక్తి వందేళ్లు బతికితే పరిపూర్ణ జీవితం.. మరి ఒక విద్యా సంస్థ వందేళ్లు పూర్తి చేసుకుందంటే.. మరో వందేళ్లకు సరిపడా ప్రణాళికలతో ముందుకెళ్తోందంటే.. అది అద్భుతమనే చెప్పాలి. అసాధారణమైన ఈ రికార్డును అందుకుంటోంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్ పీఎస్). అంతేకాదు.. ‘‘200వ వార్షికోత్సవానికి’’ తగిన పునాదిని సిద్ధం చేస్తున్నారు ఆ పాఠశాల సొసైటీ సభ్యులు. నిజాం నవాబు పాలనలో హైదరాబాద్ బేగంపేటలో 1923లో ఏర్పాటైంది హెచ్ పీఎస్. ఇన్నేళ్లలో ఎందరికో విద్యా గంధాన్ని అందించింది ఈ పాఠశాల. రాజకీయాలు, బహుళ జాతి సంస్థల్లో ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో ఉన్న ఎందరో హెచ్ పీఎస్ పూర్వ విద్యార్థులే. మంగళవారం నుంచి హెచ్ పీఎస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 27వరకు ఇవి కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి 27 మధ్య 50కి పైగా ముఖ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శతాబ్ది వేడుకల్లో ప్రోగ్రాంల సందడి
హెచ్ పీఎస్ సెంటినరీ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 24 నుంచి హెచ్ పీఎస్ కార్నివాల్, మ్యూజియం, ది ఎకోస్ ఆఫ్ టైమ్, స్టార్ట్ ఎక్స్, ఆంత్రప్రెన్యూర్స్ సమ్మిట్, స్పోర్ట్స్ రీ యూనియన్, సెంటినరీ గోల్ఫ్ టోర్నమెంట్, రీగల్ వింటేజ్ కార్ షోకేస్, స్పీడ్ నెట్ వర్కింగ్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 24న బుక్ రీడింగ్, ప్యానల్ డిస్కషన్, కార్యశాలలు, ఫలక్ నుమా ప్యాలెస్ లో సెంటినరీ డిన్నర్ నిర్వహించనున్నారు.
15 వేల మంది మధ్యన వేడుకలు
హెచ్ పీఎస్ ప్రాంగణంలో ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించే వేడుకలకు 15 వేల మంది హాజరుకానున్నారు. వీరిలో పూర్వ విద్యార్థులు, హెచ్ పీఎస్ ప్రతినిధులు, ప్రముఖులు ఉంటారు. ప్రస్తుతం హెచ్ పీఎస్ సొసైటీ అధ్యక్షుడిగా గస్తీ జే నోరియా ఉన్నారు. మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు, సత్తుపల్లి, కొత్తగూడెం నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు హెచ్ పీఎస్ ప్రతినిధుల్లో ఒకరు కావడం విశేషం. ఫయాజ్ ఖాన్, ప్రిన్సిపల్ డాక్టర్ స్కంద్ బాలీ, వైస్ ప్రిన్సిపల్ అమ్రిత్ చంద్రరాజు ఇతర ప్రతినిధులు.
మరో వందేళ్లు.. విద్యార్థి వికాసం
హెచ్ పీఎస్ ప్రస్తుతం 100 ఏళ్ల ముగింపు వేడుకల్లో ఉంది. అయితే, ఈ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ మరో వందేళ్లు ఉండేలా దాని ప్రతినిధులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యార్థులను బయటి ప్రపంచంలో అంచనాలను అందుకునేలా తీర్చిదిద్దుతున్నారు. కాగా , బేగంపేటతో పాటు రామంతాపూర్, వరంగల్, ఏపీలోని కడపలోనూ హెచ్ పీఎస్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఓవరాల్ డెవలప్ మెంట్.. స్పోర్ట్స్ యాక్టివిటీ
విద్యార్థి నిరంతర ప్రగతి హెచ్ పీఎస్ లక్ష్యం. ఇందుకోసమే స్పోర్ట్స్ యాక్టివిటీకి ప్రాధాన్యం ఇస్తుంటారు. నేషనల్స్ స్థాయి కోచ్ ల పర్యవేక్షణలో షూటింగ్ రేంజ్, హార్స్ రైడింగ్, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ లో విద్యార్థులకు చిన్నతనం నుంచే శిక్షణ ఇవ్వడం ఇక్కడి విశిష్ఠత. వీరేకాక స్పెషలిస్ట్ కోచ్ లతోనూ హెచ్ పీఎస్ టై-అప్ అయింది. బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా సింక్రనైజ్డ్ స్విమ్మింగ్ కోచ్ లను విద్యార్థుల శిక్షణకు ఏర్పాటు చేయడం విశేషం.
కాన్సెప్ట్ బేస్డ్ స్టడీ.. డిగ్నిటీ ఆఫ్ లేబర్..
‘‘కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్’’ ప్రస్తుత విద్యా విధానంలో అత్యంత కీలకమైనది ఇది. హెచ్ పీఎస్ లో దీనికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం ఖాన్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అద్భుతమైన డిజిటల్ లైబ్రరీ హెచ్ పీఎస్ సొంతం. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరువొద్దు అనేది పెద్దలు చెప్పే సూక్తి. దీనిని తూచా తప్పకుండా ఆచరిస్తున్నారు హెచ్ పీఎస్ ప్రతినిధులు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. విహార యాత్రలు నాలెడ్జ్ టూర్స్ గా ఉండేందుకు టి వర్క్స్ తరహా ప్రయోగాత్మక అభ్యసనం కోసం రూ.కోటితో ల్యాబ్ ను నెలకొల్పారు. హెచ్ పీఎస్ అల్యూమ్నిలో భాగమైన విద్యార్థులు రూ.కోటి సమకూర్చగా.. మరో రూ.4 కోట్లు సీఎస్ ఆర్ నిధులతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ను నిర్మించారు. మూడు నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మ్యూజియం ను ప్రారంభింపజేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఎన్ ఈపీకి తగినట్లు.. అద్భుత మార్పునకు
కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కు తగినట్లుగా రీ ఓరియంటేషన్ కు ప్రాధాన్యం ఇచ్చే హెచ్ పీఎస్ లో ఐజీసీఎస్ కరిక్యులమ్ అమలవుతోంది. రానున్న కాలంలో విధి విధానాల్లో అద్భుతమై మార్పులకు అవకాశం ఉంది. ఇంటరాక్టివ్ విధానం, పిల్లలపై ఒత్తిడి లేని చదువు, క్రీడలపై ఆసక్తి చూపేలా, సోషల్ ఇంటరాక్షన్, పీపుల్ మేనేజ్ మెంట్, భవిష్యత్ కు తగినట్లు సంసిద్ధం కావడంపై ట్రయినింగ్ ఇవ్వనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హెచ్ పీఎస్ లో విద్యార్థిగా అడుగుపెట్టినవారు.. పరిపూర్ణ వ్యక్తిగా బయట అడుగు పెట్టేలా తీర్చిదిద్దనున్నారు.
స్టూడెంట్ ఎక్స్ఛేంజీ పునరుద్ధరిస్తాం..: జలగం వెంకటరావు
హెచ్ పీఎస్ కు ప్రతిష్ఠాత్మక లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీతో స్టూడెంట్ ఎక్స్ఛేంజీ ప్రోగ్రాం ఉంది. చాలా ఏళ్ల కిందటే దీనిని కుదుర్చుకున్నారు. విద్యార్థులు వారంతట వారే ఎదిగేలా చూడడం హెచ్ పీఎస్ ఉన్నతోద్దేశం. మారుతున్న ప్రపంచానికి తగినట్లుగా.. రేపటికి ఎలా సంసిద్ధంగా ఉండాలో అలా తీర్చిదిద్దడమే లక్ష్యం. పాఠశాలలో దీనికి తగిన వాతావరణం కల్పించాలం. సోలార్ పవర్ ఆధారంగా కూరగాయల సాగు చేపట్టి.. 4 వేలమంది భోజనానికి సరిపడా పంటను పండిస్తున్నాం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్