వీఆర్సీ సెంటర్ల నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ

- Advertisement -

వీఆర్సీ సెంటర్ల నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ

Huge rally from VRC centers to Collectorate office

అన్నదాతలకు అండగా వైకాపా  ర్యాలీని ప్రారంభించిన  ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు
అన్నదాతలకు అండగా వైకాపా ర్యాలీని  ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ తదితరులు హజరయ్యారు.
చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ  పెట్టుబడి సాయం కింద ఏడాదికి 13,500 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. – రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా జగన్ ప్రభుత్వమే చెల్లించింది.  పెట్టుబడి సాయం పేరుతొ రైతులను చంద్రబాబు దగా చేస్తున్నారు.  ఎరువులు కూడా టీడీపీ కార్యకర్తలు, వారీ సానుభూతి పరులకు మాత్రమే ఇస్తున్నారు. ఉచిత పంటల భీమా పథకాన్ని కొనగించాలని అన్నారు.
రూరల్ ఇంచార్జి అనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ  రైతులను మోసం చెయ్యడం నా నైజం అని చంద్రబాబు మరోసారి నిరూపించారు.  యూరియా, ఎరువుల కోసం ప్రభుత్వం ముందుగానే డబ్బులు కట్టించుకోవడం దారుణం.  ప్రభుత్వం వచ్చింది ఆరు మాసాలైనా.. ఇంతవరకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు.  రైతులను మోసం చేస్తే పుట్టగతులు ఉండవని చంద్రబాబుకి తెలిసినా.. హామీలను అమలు చెయ్యకపోవడం దారుణం.  ఉచిత పంటల భీమాను అమలు చెయ్యాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular