- Advertisement -
గాజువాకలో కార్మికుల భారీ ర్యాలీ
Huge rally of workers in Gajuwaka
విశాఖపట్నం
వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుం టున్నట్టు విశాఖ నగరానికి రాక ముందే ప్రధాని మోడీ ప్రకటిం చాలని డిమాండ్ చేస్తూ గాజు వాకలో విశాఖ ప్రజలు, కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరే కంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాత గాజువాక నుంచి కొత్త గాజువాక, తిరిగి కొత్త గాజువాక నుంచి పాత గాజువాక కూడలి వరకూ నిర్వహించిన భారీ ప్రదర్శనకు స్థానికులు పూలుజల్లి ఎక్కడికక్కడ ఘనస్వాగతం పలి కారు. స్టీల్ప్లాంట్ను రక్షించాలన్న నినాదాలతో గాజువాక పరిసరాలు మార్మోగాయి.విశాఖ ఉక్కు ప్రైవే టీకరణను ఉపసంహరించు కొనేలా ప్రధాన మంత్రి మోడీపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తేవాలని కోరారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా జరుగుతున్న మహోన్నత ఉద్యమాన్ని పరిగణ లోకి తీసుకొని ప్రధాని తన పర్యట నలో సానుకూల నిర్ణయం తీసుకో వాలని డిమాండ్ చేశారు.
- Advertisement -