Sunday, September 8, 2024

మెగా జాబ్ మేళాకు భారీ స్పందన

- Advertisement -
Huge response to mega job fair
Huge response to mega job fair

హుస్నాబాద్
యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో  మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని  రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత వైస్ చైర్మన్ అయిలేని అనిత,  సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆర్డీవో శ్రీరామమూర్తి  మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఇతర అధికారులు పాల్గోన్నారు.
ఈ మెగా జాబ్ మేళ కి మంచి స్పందన వచ్చింది. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హజరయింది. దాదాపు 60 కి పైగా కంపెనీలు పాల్గొన్నాయి.5000 ఉద్యోగాల నియామకం చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. జాబ్ మేళా కి వచ్చిన వారికి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి హెల్త్ క్యాంప్ లు, బోజన వసతులు ఏర్పాటు చేసారు.
మంత్రి మాట్లాడుతూ యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా కు జీరో నుండి పీజీ వరకు హుస్నాబాద్ నియోజవర్గం నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకున్న  వారు 6 వేల మంది ఉన్నారు. హుస్నాబాద్ జీరో టూ పీజీ వరకు జాబ్ మేళా లో పాల్గొనడానికి వచ్చిన వారికి స్వాగతం.కు ఎక్కడ ఏ కంపనీ లో జాబ్ కావాలంటే అక్కడ ఇంటర్వ్యూ కి అటెండ్ కావాలి.తదుపరి జాబ్ మేళా మండల స్థాయిలో నిర్వహిస్తాం. జాబ్ మేళా కోసం వేలాది గా యువత తరలివచ్చారు. వారందరికీ మంచి అవకాశం. మీకు ఉన్న నైపుణ్యం తో కావాల్సిన ఉద్యోగం తో ఇక్కడి నుండి వెళ్ళాలని కోరుతున్న.ఇవే కాకుండా విదేశాల్లో కూడా నర్సింగ్ ,నిర్మాణ రంగం,ఇతర రంగాల్లో లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు  ఉన్నాయి.మండలాల వారిగా ఇలాంటివి ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాత్రి 10 అయినా సరే ఇక్కడే ఉండి ఓపికగా ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. హుస్నాబాద్ లో మొదటిసారి జాబ్ మేళా జరుగుతుంది. ప్రభుత్వం నుండి పకడ్బందీగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. నిరుద్యోగులకు దాదాపు ఉద్యోగాలు వచ్చేలా అవకాశాలు కల్పించాలి. ఇవే కాకుండా పాల ఉత్పత్తి, చేపల పెంపకం, గ్రామీణ పరిశ్రమలు కల్పించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి టూరిజం గా కూడా అభివృద్ధి చేస్తాం. ఎవరు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి. అందరూ మంచిగా ఇంటర్వూ చేస్తూ ఉద్యోగాలు పొందే లెటర్ లతో పోవాలి. ఉద్యోగాలు పొందే యువతకు అందరికీ శుభాకాంక్షలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్