ఏటా సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’

- Advertisement -

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ రోజు అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్‌లో పేర్కొంది.
‘‘భారత్‌ స్వాతంత్య్రం పొందాక హైదరాబాద్‌ సంస్థానం 13 నెలల పాటు నిజాంల పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్‌ 17న పోలీస్‌ చర్య ‘ఆపరేషన్‌ పోలో’తో ఈ ప్రాంతం భారత్‌లో విలీనమైంది. సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విమోచన దినం’ నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి నింపడానికి సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విమోచన దినం’ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular