Friday, November 22, 2024

హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్‌

- Advertisement -

హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్‌

Hyderabad's largest underpass

హైదరాబాద్, అక్టోబరు 15, (వాయిస్ టుడే)
ప్రపంచ పటంలో హైదరాబాద్‌కు ఉన్న స్థానం ప్రత్యేకం. హైదరాబాద్‌ కూడా రోజురోజుకూ అదే స్థాయిలో పేరుప్రఖ్యాతలు సాధిస్తోంది. అలాగే.. అదే స్థాయిలో విస్తరిస్తోంది కూడా. పల్లెల నుంచి నిత్యం మహానగరానికి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. సిటీ జనాభా ఏటా అమాంతం పెరుగుతోంది. అయితే.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జీహెచ్ఎంసీ సైతం సదుపాయాలు కల్పిస్తోంది. సరికొత్త పద్ధతులను అవలంబిస్తోంది. ప్రజలకు ఇబ్బందులు రాకుండా వినూత్న ప్రయోగాలకు దిగుతోంది. ఇప్పటికే నగర ప్రజల కోసం మెట్రోను, ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకు రాగా.. మరో కొత్త ఆలోచనకు తెరతీసింది.హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ కష్టాలు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లాలంటే పెద్ద టాస్క్. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతోపాటే వాహనాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్‌లో చుక్కలు చూస్తుననారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చారు. పలు కొత్త ఫ్లై ఓవర్లను సైతం నిర్మించారు. అయినప్పటికీ ప్రజలకు ఇంకా పూర్తిస్థాయిలో ట్రాఫిక్ కష్టాలు తొలగలేదు. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి తప్పితే ఏమాత్రం తగ్గలేదు.నగర ప్రజలకు శాశ్వత ఉపశమనం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త ఆలోచన చేసింది. ఓఆర్ఆర్ అవతల వైపు అభివృద్ధి పరుగులు పెడుతున్న మహానగరంలో ట్రాఫిక్ బాధలు లేకుండా చేయడానికి రేవంత్ సర్కార్ ఈ దిశగా అద్భుత ఆలోచన చేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్ నిర్మించాలని నిర్ణయించింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో ఈ అండర్‌పాస్‌లు నిర్మించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా కేబీఆర్ పార్క్ సమీపంలో నిర్మించనున్నారు. అలాగే.. ఐటీ కారిడార్‌ను, ఇటు సికింద్రాబాద్‌ను కలిపే ఈ ప్రాంతంలో నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.హైదరాబాద్‌లోనే అతిపెద్ద అండర్‌పాస్‌గా దీనిని నిర్మించనున్నారు. దీని నిర్మాణం వల్ల కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ అనేది లేకుండా ప్రయాణం సాగించవచ్చు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ మెయిన్ గేటు వైపు సుమారు 740 మీటర్ల వరకు అతిపెద్ద అండర్ పాస్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ అండర్ పాస్ కనుక అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్, ఫిల్మ్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రయాణం ఈజీ కానుంది. ఇలా కేబీఆర్ చుట్టూ 7 అండర్ పాస్‌లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ చౌరస్తా వద్ద రూ.192 కోట్లతో రెండు అండర్ పాస్‌లు, ఓ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. దీని వల్ల యూసుఫ్‌గూడ నుంచి వచ్చే వాహనాలు జూబ్లీ చెక్ పోస్ట్ వైపు మళ్లింపబడుతాయి. అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్టు నుంచి వచ్చే వాహనాలు ఫ్రీ లెఫ్ట్ ద్వారా యూసుఫ్ గూడ, క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్లాల్సిన వాహనాలు అండర్ పాస్ ద్వారా వెళ్లొచ్చు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్