- Advertisement -
ఇబ్రహీంపట్నంలో హైడ్రా కమిషనర్ పర్యటన
HYDRA Commissioner's visit to Ibrahimpatnam
రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా తుర్కా యంజాల్ మసాబ్ చెరువు,జీలావర్ ఖాన్ చెరువులను హైడ్రా కమిషనర్ రంగానాధ్ పరిశీలించారు.
చెరువుల ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన హైడ్రా కమిషనర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలను అయన పరిశీలించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని తుర్కా యంజాల్,జీలావర్ ఖాన్ చెరువులను పరిశీలించారు రంగనాధ్. స్థానిక ప్రజలు ఇచ్చిన పిర్యాదుల మేరకు పరిశీంచడం జరిగిందన్నారు. బుధవారం నాడు డు స్థానిక అధికారులతో కలిసి మసాబ్ చెరువు లింక్ తో ఉన్న నాలాలను, బఫర్ జోన్ లను పరిశీలిండం జరిగింది అన్నారు. * సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చెరువుల యొక్క ఎఫ్ టి ఎల్,బఫర్ జోన్లను పరిశీలిస్తామని రంగానాధ్ అన్నారు. * నిష్ణాతులైన ఇంజనీర్ల ద్వారా ఆక్రమణలను అధ్యయనం చేస్తామన్నారు. రెండు,మూడు నెలలో ఆక్రమణలు నిజమని తెలితే చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు.
- Advertisement -