మణికొండలో హైడ్రా కూల్చివేతలు

- Advertisement -

మణికొండలో హైడ్రా కూల్చివేతలు

Hydra demolitions in Manikonda

రంగారెడ్డి
మణికొండ అల్కపూరి కాలనీ లో హైడ్రా దూకుడు ప్రదర్శించింది. ఓ అపార్ట్మెంట్ లో కమర్షియల్ షెట్టర్స్ ను తొలగించారు. రెసిడెన్షియల్ గా అనుమతులు తీసుకొని కమర్షియల్ గా వ్యాపార సముదాయాలు

నడిపిస్తున్నట్లు ఫిర్యాదు అందింది.  గత వారం క్రితం హైడ్రా కమీషనర్ రంగనాథన్ స్పాట్ విజిట్ చేసారు. హైడ్రా కమీషనర్ అదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాల తొలగించారు. అధికారులకు

వ్యాపారస్తులకు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మేము వ్యాపారం కొనసాగిస్తున్నాం. మణికొండ మునిసిపాలిటీ కి లక్షల రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్నాము.  రెసిడెన్షియల్ నుండి

కమర్షియల్ గా కన్వెన్షన్ అయింది.  ఓ బాడా వ్యక్తి ఒత్తిడి మేరకు కూల్చివేతలు చేసారంటూ వ్యాపారస్తులు  దుమ్మెత్తి పొస్తున్నారు. మా వద్ద డబ్బులు డిమాండ్ చేసాడు. డబ్బులు ఇవ్వకపోతే అతని పలుకుబడి

ఉపయోగించి అధికారులను ఒత్తిడి చేసాడు.  తెల్లవారుజామున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారు.  హైడ్రా కమీషనర్ రంగనాథన్ కు ఇందులో ఇంట్రెస్ట్ ఏంటి అంటూ ప్రశ్నించారు. డబ్బులు

ఇవ్వకుంటే కూల్చివేతలు చేస్తారా? మాకు న్యాయం చేయండి అంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular