Sunday, September 8, 2024

మీ అందరి అభిమానానికి సదా కృతజ్ఞడను…!

- Advertisement -
I am forever grateful for all your love…!

_కృతజ్ఞత యాత్రతో తనను గెలిపించిన ప్రజలను కలిసి ధన్యవాదాలు తెలుపుతున్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

మొదటి రోజు జోరుగా సాగిన “కృతజ్ఞత యాత్ర”…

కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (జనవరి 7) : గత తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని బలపరుస్తూ రానున్న ఐదేళ్లలో జరిగే అభివృద్ధిని తెలియజేస్తూ ముందుకు సాగుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తనను గెలిపించి గెలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజా నాయకుడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద తలపెట్టిన కృతజ్ఞత యాత్ర మొదటి రోజు 132 – జీడిమెట్ల డివిజన్ లోని అంగడి పేట, మీనాక్షీ ఎస్టేట్స్, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ, జీడిమెట్ల విలేజ్, జయరాం నగర్, అయోధ్య నగర్ మీదుగా కుత్బుల్లాపూర్ గ్రామం వరకు కొనసాగింది. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కి ఆయా కాలనీల వాసులు, సంక్షేమ సంఘాల నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ ఇటీవల జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో మునుపెన్నడూ లేని విధంగా అద్భుత విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ ప్రజానీకానికి సదా కృతజ్ఞుడనై ఉంటూ ఎల్లవేళలా మీ సాధక, బాధకాల్లో పలుపంచుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ఈ విజయం నా ఒక్కడి విజయం.. కాదు ఇది కుత్బుల్లాపూర్ ప్రజల విజయం. మీ అందరి మద్దతుతో నేడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేరు రాష్ట్ర స్థాయిలో చిరస్థాయిగా నిలిచేలా ఉందిపోనుందన్నారు. మీరు అందించిన ఈ విజయంతో రానున్న రోజుల్లో మరింత వేగంగా కుత్బుల్లాపూర్ నియోజవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామన్నారు.

కృతజ్ఞత యాత్ర మొదటి రోజు సాగిన కాలనీలు…

అంగడి పేట..
కృతజ్ఞత సభ మొదటి రోజు అంగడిపేట వద్దకు చేరుకోగానే స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర లో భైరి అనిల్, కవిత, శ్రీను, డి.వినీత్, ముద్దాడి కృష్ణ, నరేందర్ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మీనాక్షీ ఎస్టేట్స్ వద్ద….
కృతజ్ఞత యాత్ర ద్వారా అంగడి పేట నుంచి మీనాక్షీ ఎస్టేట్స్ కు చేరుకున్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. మీనాక్షీ ఎస్టేట్స్ సమావేశం నందు కాలనీ వాసులతో సమావేశమైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద రానున్న రోజుల్లో మీనాక్షీ ఎస్టేట్స్ నందు అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేసుకుందామన్నారు. ఈ కృతజ్ఞత యాత్రలో మీనాక్షీ ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిన్న రాజేష్, కాలనీ వాసులు ప్రహ్లాద్, కల్పన, ఉదయ్ కుమార్, రామిరెడ్డి, వీరా రెడ్డి, భాను రెడ్డి, రజినీకాంత్ రెడ్డి, శేఖర్, ఆర్.కే.సింగ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం

స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ…
స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కృతజ్ఞత యాత్ర కొనసాగగా స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి శాలువాతో సత్కరించి మహాత్ముడి ప్రతిమను బహూకరించారు. ఈ యాత్రలో స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ వాసులు ప్రసాద్ గౌడ్, వర ప్రసాద్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జీడిమెట్ల గ్రామం వైపుగా కొనసాగగా

జీడిమెట్ల గ్రామంలో….
జీడిమెట్ల గ్రామం కు చేరుకున్న కృతజ్ఞత యాత్ర కు స్థానిక కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ కృతజ్ఞత యాత్రలో స్థానికులు పద్మ, శ్యామల, దేవప్ప, అశోక్, శ్రీనివాస్, ఆనంద్ బాబు, బీరప్ప, బాలా చారి, కుమార్, హరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జీడిమెట్ల విలేజ్ నుంచి కొనసాగిన యాత్ర గోదావరి హోమ్స్ మెయిన్ రోడ్డు మీదుగా జయరాం నగర్ వరకు కొనసాగగా…

జయరాం నగర్ వద్ద….
జయరాం నగర్ చేరుకున్న కృతజ్ఞత యాత్రకు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జయరాం నగర్ అధ్యక్షులు మల్లేష్, ఉపాధ్యక్షులు బిక్షపతి, కాలనీ వాసులు యాది, ప్రేమ్, చంద్రయ్య, ఈశ్వర్, హరి, పెద్ది రాజు, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం జయరాం నగర్ నుంచి అయోధ్య నగర్ వైపుగా కొనసాగగా…

అయోధ్య నగర్ వద్ద….
జయరాం నగర్ నుంచి అయోధ్య నగర్ కు చేరుకున్న ఎమ్మెల్యే కృతజ్ఞత యాత్రకు బాణా సంచి కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అయోధ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యేసు, కాలనీ వాసులు సోమనర్సయ్య, బాల్ రాజ్ గౌడ్, రాజ్ కుమార్,మల్లేష్ గౌడ్, లింగమయ్య, ఉమేష్ సింగ్, ప్రమోద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 132 డివిజన్ సీనియర్ నాయకులు కుంట సిద్ది రాములు, నరేందర్ రెడ్డి, సుధాకర్ గౌడ్, ఎల్లా గౌడ్, కాలే నగేష్, బాల మల్లేష్, కాలే గణేష్, జైపాల్ గౌడ్, మహిళా నాయకురాలు ఇందిరా రెడ్డి, పద్మ, అరుణా రెడ్డి, శ్యామల, కల్పన, కవిత, పలు కాలనీలవాసులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్