- Advertisement -
అనారోగ్యంతో బాధపడే వారికి అండగా నేనుంటా
I am there for those who are sickఎమ్మెల్యే జారె
ఆశ్వరావుపేట
అశ్వారావుపేట మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అనంతారం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు కోల్పోయిన గడ్డం రాజులును ని పరామర్శించి ఆర్ధికంగా సహాయం చేశారు. త్వరలో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి పంపించి మెరుగైన వైద్యం అందించి కృత్రిమ కాలు ఏర్పాటు చేయిస్తానని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.
మళ్లాయిగూడెం పంచాయతీ దిబ్బగూడెం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన సోడెం సూరప్ప గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.
వినాయకపురం గ్రామంలో పెరాలసిస్‌తో బాధపడుతున్న జక్కుల జగదీష్ గారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కేశప్పగూడెం గ్రామంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తెల్లం దుర్గమ్మ ఆరోగ్య వివరాలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలన్నారు మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తానన్నారు.
దమ్మపేట మండలం గుర్వాయిగూడెం గ్రామంలో గుండెపోటుతో మరణించిన డాన్స్ మాస్టర్ తామ తేజా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు…
- Advertisement -




