ఢిల్లీ చేతులలో బానిసలం అవుదామా: పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్: ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టండి…మీ పార్టీకే గ్యారెంటీ లేదు
ప్రమాణం చేసి చెపుతున్నాను వావిలాల ని మండలం చేసి చూపిస్తా నేను రాజకీయాల్లోకి వచ్చిందే మీ మొహంలో చిరునవ్వు చూడడం కోసమని, ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జమ్మికుంట లోని నగరం, నగురం, వావిలాల,పాపక్కపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను ఘనంగా పెట్టి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. సాధించిన తెలంగాణ ను ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి పదానికి నడిపించిన మహర్షి కేసీఆర్ అన్నారు. ఇక్కడ లేని విధంగా 24 గంటల కరెంటు తో పాటు 19 వేల కోట్లు రుణమాఫీ చేసి రైతుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు అన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణ పాలన ఢిల్లీ కి వెళ్తుందని, మరోసారి తెలంగాణ ప్రజలు ఢిల్లీ చేతుల్లో బానిసలు అవుతారని అన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రం అంధకారంలోకి పోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కొత్త మేనిఫెస్టో రూపొందించారని, మేనిఫెస్టోలో పేద ప్రజల అభ్యున్నతి కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
ఇందులో ముఖ్యంగా కెసిఆర్ ధీమా ఇంటింటికీ భీమా అని తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా పోషకులు మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నామని అన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకంతో ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయాలు అందజేయనున్నామని, దీంతోపాటు గ్యాస్ సిలిండర్ ని కూడా కేవలం 400 కే అందజేస్తామన్నారు. అంతేకాకుండా అన్నపూర్ణ పేరిట తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్న బియ్యం ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీని కూడా ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామన్నారు. పెన్షన్ కూడా దఫలవారీగా 5000 వరకు పెంచుతామని, వికలాంగుల పెన్షన్ కూడా 4000 నుంచి 6000కు పెంచనున్నామన్నారు. బీసీ బందు, గృహలక్ష్మి పథకాలు పెట్టుకున్న అందరికీ కూడా ఎలక్షన్ అనంతరం చెక్కులు పంపిణీ చేస్తామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల పథకాన్ని తీసుకొచ్చిందని, అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదన్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వారు అందుకే కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదన్నారు. నన్ను గెలిపించిన వెంటనే వావిలాల ను మండలం చేసి చూపిస్తా అన్నారు. మీ దండం పెట్టి అడుగుతున్న హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలంటే ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కోరారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పింగళి రమేష్ ,నాగారం గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్, పాటు తదితరు నాయకులు పాల్గొన్నారు.