నిందలు పడటం నా జీవిత లక్ష్యం అనుకుంటా

- Advertisement -

పవన్‌ గురించి రెండు సందర్భాల్లోనూ నిజమే చెప్పా: రేణూ దేశాయ్‌

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్ (Pawan kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్‌ (Renu Desai) మరోసారి వైరల్ కామెంట్స్‌ చేశారు. ఓ అభిమాని ఆమె విడాకులపై అభ్యంతరకర కామెంట్‌ పోస్టుచేయగా..

రేణూ అతడికి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. ”నన్ను నిందించడంలో మీకు ఆనందం ఉంటే అలానే చేయండి. పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకుల నుంచి నిందలు పడటం నా జీవిత లక్ష్యం అనుకుంటా..” అని రేణూ దేశాయ్‌ రిప్లై ఇచ్చారు..

I think my life's goal is to be blamed
I think my life’s goal is to be blamed

ఇటీవల ఆమె పవన్‌ కల్యాణ్‌కు మద్దతు ప్రకటిస్తూ వీడియో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు వ్యక్తులు ఆమెను టార్గెట్‌ చేసి మాట్లాడారని రేణూ చెప్పారు. ”విడాకుల గురించి చెప్పినప్పుడు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు నన్ను తీవ్రంగా ద్వేషించారు. ఇప్పుడు దేశ పౌరురాలిగా ఆయనకు మద్దతుగా మాట్లాడుతుంటే అతడి వ్యతిరేకులు నన్ను దుర్భాషలాడుతున్నారు. తొలుత విడాకుల గురించి మాట్లాడి.. ఆయన వ్యతిరేకుల నుంచి డబ్బు తీసుకున్నానని ఆరోపించారు. ఇప్పుడేమో.. పవన్‌ అనుకూల వ్యక్తుల నుంచి నేను సొమ్ము తీసుకుని ఆయనకు మద్దతిచ్చానని అంటున్నారు. నా మాజీ భర్త గురించి అప్పుడూ, ఇప్పుడూ రెండు సందర్భాల్లోనూ నేను నిజమే చెప్పాను. తప్పుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ప్రేమలో పడినందుకు.. నిజాలు మాట్లాడుతున్నందుకు నేను ఇలా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇదే నా విధి రాత అయితే.. ఇలానే తిట్టండి.. ఈ కామెంట్స్‌పై కూడా నన్ను నిందించడం ప్రారంభించండి” అని రాసుకొచ్చారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular