మళ్లీ జైలుకు పోసాని
I went to jail again.
విజయవాడ, మార్చి 12
పోసానికి కొన్ని కేసుల్లో బెయిల్.. మరికొన్ని కేసుల్లో నోటీసులు జారీ చేయాలని కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. దాంతో ఇక కర్నూలు జైలు నుంచి విడుదలయి ఇంటికి వెళదామని అనుకున్నారు కానీ సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ తో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పిటి వారింటిపై పోసాని నీ గుంటూరు జిల్లా కు తరలించారు. ఆదోని త్రీ టౌన్ కేసులో అరెస్ట్ అయి ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జిల్లా జైలులో ఉంటున్న పోసానిని.. వర్చువల్ గా కాకుండా ఫిజికల్ గా హాజరు పరచాలని సూచించడంతో గుంటూరు జిల్లాలో కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు. సీఐడీ పోలీసులు జారీ చేసిన పీటీ వారెంట్ ను రద్దు చేయాలని అత్యవసరంగా పోసాని తరపు లాయర్లు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో పోసాని ఈ కేసుల్లోనూ బెయిల్ వచ్చే వరకూ జైల్లో ఉండాల్సి ఉంటుంది.వైసీపీ నాయకుడిగా ఉంటూ పోసాని కృషమురళి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను వారి కుటుంబాలను, పిల్లలను కూడా ఇష్టం వచ్చినట్లుగా తిట్టడంతో అనేక కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత కూడా ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడుపై తిట్లందుకున్నారు. ఈ విషయంలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే హఠాత్తుగా తాను రాజకీయాల నుంచి విరమించుకున్నానని ఇక రాజకీయాలు మాట్లాడబోనని ప్రకటించి సైలెంట్ అయిపోయారు. కానీ పోలీసులు హఠాత్తుగా ఫిబ్రవరి నెలాఖరులో ఆయనను రైల్వే కోడూరు పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై నమోదైన కేసుల్లో పోలీసులు పీటీ వారెంట్లు జారీ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. నర్సరావుపేట కోర్టు ఆయనకు రెండు రోజుల కస్టడీ కూడా ఇచ్చింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని.. బెయిల్ ఇవ్వాలని పోసాని న్యాయపోరాటం చేస్తున్నారు. రాజంపేట సబ్ జైల్లో ఉన్నప్పుడు గుండెపోటు, కడుపు నొప్పి అని నాటకం ఆడటంతో పోలీసులు సీరియస్ అయ్యారు. రెండు వారాల పాటు జైల్లో ఉండి అటూ ఇటూ తిప్పిన తర్వాత ఇక ఇప్పుడల్లా బెయిల్ రాదేమోనని కంగారు పడుతున్న సమయంలో ఆయనకు బెయిల్ లభించింది. కానీ సీఐడీ పోలీసులు మాత్రం అనూహ్యంగా పీటీ వారెంట్ దాఖలు చేశారు. రైల్వే కోడూరు పోలీసులకు ఆయన తనకు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు స్క్రిప్టులు పంపేవారని.. అందుకే తిట్టేవాడ్ని అని చెప్పారు. ఈ మేరకు వారిని కూడాపోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉండటంతో వారిద్దరూ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోసాని కృష్ణమురళి తనపై జారీ చేసిన పీటీ వారెంట్లు రద్దు చేయాలని హైకర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోవడంతో ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చే వరకూ బయటకు రావడం కష్టమేనని న్యాయవర్గాలు చెబుతున్నాయి.