రాజకీయాల్లో ఒంటరిగానే ఉంటా.. మళ్లీ బీజేపీలో చేరబోను ..
స్పష్టం చేసిన మాజీమంత్రి గాలి జనార్దనరెడ్డి
బెంగళూరు ఫిబ్రవరి 19
రాజకీయాల్లో ఒంటరిగానే ఉంటానని, మళ్లీ బీజేపీలో చేరబోనని కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతి ఎమ్మెల్యే, మాజీమంత్రి గాలి జనార్దనరెడ్డి స్పష్టం చేశారు. కొప్పళలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో చేరడమనేది కలలో కూడా జరగదన్నారు. కాంగ్రెస్ తో సంబంధాలు ఎప్పటికీ ఉండవన్నారు. ప్రధాని మోదీ పాలన అద్భుతమని కొనియాడారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గాలి జనార్దనరెడ్డి మరోసారి బీజేపీలోకి చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. సీఎం సిద్దరామయ్య శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బీజేపీ, జేడీఎస్ బాయ్‌కాట్ చేసినా జనార్దనరెడ్డి సభలోనే ఉన్నారు. తర్వాత సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌తో కలిసి ఫొటోలు దిగారు. దీంతో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తారనే ప్రచారం సాగింది.
రాజకీయాల్లో ఒంటరిగానే ఉంటా..

- Advertisement -
- Advertisement -



