షర్మిల వెంట వుంటాను
ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి
నేను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం నిర్ణయిస్తుంది. వైసీపీకి నేను ఎంత సేవ చేశానో నాకు తెలుసని మంగళగిరి ఎమ్మెల్యేరామకృష్ణారెడ్డి అన్నారు.
నేను సర్వస్వం పోగొట్టుకున్నాను. నేను వైఎస్ షర్మిలా వెంట నడుస్తా. నేను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిని. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటాను.
నేను షర్మిలను కలిశాను షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా అప్పుడు నా నిర్ణయం ఉంటుంది. వైసీపీకి సిద్దాంతాలు ఉండాలి. ఎంచుకున్న అభ్యర్థులను ఒడించాలి అంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చెయ్యాలి. మంగళగిరి ప్రజలు అభివృద్ధినీ కోరుకుంటున్నారని అన్నారు.
.1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లను మాత్రమే కేటాయించారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించాను. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు.
కాంట్రాక్టర్లు నాపై ఒత్తిడి తెచ్చినా నేను సీఎంవోకు పదే పదే వెళ్లి అడిగాను. స్వయంగా నేనే 8కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చాను. నా సొంత డబ్బుతో ఎంటిఎంసి ,దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేసాము. లోకేష్ ను ఓడించిన నాకు సహకారం అందించకపోతే ఎలా అని ప్రశ్నించారు. నేను ఎవరిని నిందించడం లేదు. నాకు ధనుంజయ రెడ్డి చాలా సార్లు మేసేజీలు పెట్టారు నిధులు మంజూరు చేస్తానని.
ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారు. రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. నేను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చాను. మంగళగిరి ప్రజలకు నేను దూరంగా ఉండను. ఎవరు గెలవాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఏ పార్టీలో చేరిన ఆరోజు నా నిర్ణయం చెప్తా. ఉంటే వైసీపీలో ఉంటాను అని చెప్పా ఇప్పుడు వైసీపీ వీడాను. నేను చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. చాలా మంది నన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నేను వైఎస్ కుటుంబంతో ఉన్నాను ఉంటానని చెప్పా. చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తా. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకొను. రేవంత్ కాంగ్రెస్ లో ఉన్న షర్మిల కాంగ్రెస్లో కు వచ్చినా నా పోరాటం ఆగదు సీఎం అయితే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పా. తప్పు ఎవ్వరూ చేసినా తప్పే. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడననని అన్నారు.