Monday, April 6, 2026

ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం రైతులకు అన్యాయం జరగనివ్వను

- Advertisement -

ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం రైతులకు అన్యాయం జరగనివ్వను

I will not allow injustice to farmers as long as I am MLA

 పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు

పెద్దపల్లి
తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం రైతులకు అన్యాయం జరగనివ్వనని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో గురువారం  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మార్కెట్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు  మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ధాన్యం కోతలు అనే పదానికీ తావు ఇవ్వనని స్పష్టం చేశారు. ప్రస్తుత సీజన్ వడ్లను కొనుగోలు సందర్భంగా ఎక్కడైనా కటింగ్ చేస్తే తాను అక్కడికి వచ్చి వాలుతానని, సన్న రకాల ధాన్యానికి క్వింటాలకు రూ.500 బోనస్ చెల్లించడం జరుగుతుంద న్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్ల కటింగ్ పేరున కట్ చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సన్న రకం వడ్ల విషయంలో ఎలాంటి సందేహాలకు తావివ్వకూడదని, పరిమితం లేకుండా ఎన్ని క్వింటాళ్ల సన్న వడ్లు అమ్మినప్పటికీ అమ్మిన మొత్తానికి వారికి బోనస్ చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో రుణమాఫీ చేయని బీఆర్ఎస్ పార్టీ నేతలు రైతుల్లో కావాలని అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు ఏమాత్రం అన్యాయం జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, రైతు ప్రభుత్వ పరంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఏమాత్రం అన్యాయం జరిగినా తాను ముందుండి రైతుల పక్షాన నిలబడతానని భరోసా ఇచ్చారు. అనంతరం  ఎమ్మెల్యే  రాష్ట్ర పశుసంవర్థక శాఖ వారి 21వ అఖిల భారత పశుగణన వాల్ పోస్టర్ ను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధికారుల, పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్