Sunday, January 25, 2026

జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయం సీఎంతో మాట్లాడుతా…

- Advertisement -

జర్నలిస్టులకు ఇండ్ల‌ స్థలాలు ఇస్తాం.. మంత్రి కేటీఆర్

I will talk to the CM about housing for journalists.
I will talk to the CM about housing for journalists.

హైద‌రాబాద్ :ఆగస్టు 03: జర్నలిస్టులకు ఇండ్ల‌ స్థలాలు ఇస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.ఈ అంశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనలో ఉందన్నారు.

అసెంబ్లీలో గురువారం మంత్రి కేటీఆర్‌ను డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ డీజేహెచ్‌ఎస్‌ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, డైరెక్టర్లు డేగ కుమార్, ప్రతాప్‌ రెడ్డి, దండా రామకృష్ణ, సలహాదారు విక్రమ్‌రెడ్డి, సభ్యులు వేములపల్లి రాజు, పోలంపల్లి ఆంజనేయులు కలిశారు.

ఈ సందర్భంగా వారు తమకు ఇండ్ల‌ స్థలాలు కేటాయించాలని కేటీఆర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డీజేహెచ్‌ఎస్‌ గురించి అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ డీజేహెచ్‌ఎస్‌ అని ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాగా, జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్