ఆదర్శ ఉద్యోగమే సంస్థ అభివృద్ధికి మూలం

- Advertisement -

ఆదర్శ ఉద్యోగమే సంస్థ అభివృద్ధికి మూలం

Ideal job is the source of development of the organization

బద్వేలు మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ రావు..

బద్వేలు

బద్వేల్ ఆర్టీసీ డిపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోడ్డు భద్రతా ఉత్సవాల సందర్భంగా ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ జరిగినది ఈ కార్యక్రమం బద్వేలు డిపో మేనేజర్ ఆర్ సి నిరంజన్  ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బద్వేల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ఉద్యోగులను గూర్చి మాట్లాడడం జరిగింది. ఆదర్శంగా ఉద్యోగం చేయడం వలనే సమస్త అభివృద్ధి పథంలో పయనిస్తుందని భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని సమస్త మనుగడ కోసం ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తద్వారా సంస్థఅభివృద్ధి బాటలో పయణినించిభవిష్యత్ తరాలకు ఉద్యోగఅవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని తద్వారా కొంతవరకు నిరుద్యోగం తగ్గే అవకాశం ఉంటుందని అన్నారుసంస్థలో వారి వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడేసంస్థకుమనుగడ సాధ్యమని వ్యాఖ్యానించారు
డిపో మేనేజర్  నిరంజన్  మాట్లాడుతూ ఉద్యోగుల సమిష్టి కృషి ఫలితమే మనం ఈ పీకే లోను మరియు కేఎంపిఎల్ లోనూ అలాగే సంక్రాంతి స్పెషల్ బస్సులు తిప్పడంలోనూ రెండవ స్థానంలో ఉన్నామని ఆ కృషి ఫలితం ఉద్యోగులకే చెందుతుందని  ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో బాధ్యతాయుతంగా నడుచుకోవడం మూలానే మనం ముందుకు పోతున్నామని అలాగే ఎప్పటికప్పుడు బస్సులను కండిషన్లలో ఉంచుతూ సహకరిస్తున్న మెకానిక్ లు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బస్సులను ఏర్పాటు చేయడంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ బిఎస్ నాయక్  కృషి ఎనలేని దని అలాగే కంట్రోలర్లు సిస్టం సూపర్వైజర్  ఇందులో భాగస్వామ్యం కావడం స్వాగతించదగ్గ విషయం అన్నారు అనంతరం ఆదర్శ ఉద్యోగులుగా ఎంపిక కాబడిన ట్రిమ్ డ్రైవర్లు కండక్టర్లు మెకానికులు కంట్రోలర్ లు లీడింగ్ హ్యాండ్ సిస్టం సూపర్వైజర్ శ్రామిక్ లకు ఎం వి ఐచే ప్రశంసా పత్రాలు అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు అసోసియేషన్ నాయకులు కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular