హై రిస్క్ గర్భిణీ స్త్రీలను గుర్తించండి- మాతృ మరణాలు శిశు మరణాలను అరికట్టండి
Identify high risk pregnant women – prevent maternal mortality & infant mortality
డాక్టర్ జె. వినయ కుమార్
బద్వేలు
బద్వేల్ మండలము తొట్టిగారి పల్లి ప్రాథమిక ఆరోగ్య లో జరుగు ప్రధానమంత్రి మాతృత్వ అభయాన్ సురక్షిత ప్రోగ్రాం గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జె. వినయ కుమార్ మాట్లాడుతూ మండలంలోని గర్భిణీ స్త్రీలు అందరికీ సరైన ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు అందించి, మరియు ముఖ్యంగా కష్టతరమైనటువంటి గర్భిణీ స్త్రీలను గుర్తించి 102,108 వాహనము ఉపయోగించుకొని, సరైన సమయంలో సరైన చికిత్సను అందించవలసినదిగా సిబ్బంది కి ఆదేశించడమైనది, అదేవిధంగా పోషకాఆహా రాము పై గవర్నమెంట్ ఆస్పత్రులు కాన్పులు పైన వ్యాధి నిరోధక టీకాల పైన అవగాహన కల్పించి, ఆరోగ్య కార్యకర్తలు , ఆరోగ్య ఆయుష్మాన్ మందిరంలో గర్భిణీ స్త్రీలకు అందుబాటులో ఉంచవలసినదిగా ఆరోగ్య సిబ్బందికి సలహాలు సూచనలు ఇవ్వడం అయినది అనంతరం చింతల్ చెరువు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ఆరోగ్య సిబ్బంది, గీత ఏ. ఎన్. యం,ఆశ కార్యకర్తలు బాలరాణి, రాజమ్మ వారు గర్భిణి స్త్రీలు అందరికీ పోషకాహారం కింద పండ్లు, బిస్కెట్లు మరియుభోజనం ఏర్పాటు చేయడమైనదు ఈ కార్యక్రమంలో డాక్టర్ విశ్వంత హెల్త్ ఎడ్యుకేటర్ బి వెంగయ్య, హెల్త్ సూపర్వైజర్ కె. వెంకటమ్మ కమ్యూనిటీ, విలేజి హెల్త్ క్లినిక్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, మరియు మరియు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు,పాల్గొన్నారు.