Sunday, September 8, 2024

బీజేపీ గెలిస్తే… బీసీ సీఎం

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 21, (వాయిస్ టుడే):  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. ఏ క్షణంలోనైనా బీజేపీ అభ్యర్థుల ప్రకటన రావొచ్చని ఎంపీ లక్ష్మణ్ స్పష్టత ఇచ్చారు. 3 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని, తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశామని వివరించారు. దీంతో బండి సంజయ్, వివేక్, రఘునందన్ తో పాటు పలువురి కీలక నేతల పేర్లు తొలి జాబితాలోనే ఉండొచ్చని స్పష్టమవుతోంది.  ముందుగా ప్రకటించినట్లుగానే ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేసేందుకు అధిష్ఠానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.’ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుంది. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్ద పీట వేశాం. తొలి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నాం. రాజాసింగ్ సస్పెన్షన్, పోటీ అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది.’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు.బీసీలకు పెద్ద పీట వేస్తున్న పార్టీ బీజేపీనే అని, అనేక సంక్షేమ పథకాలను బీసీల కోసం అమలు చేస్తున్నామని ఎంపీ లక్ష్మణ్ వివరించారు. బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం అని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలోనూ బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తోందన్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. ఈ 2 పార్టీలు బీసీలను పట్టించుకోవడం లేదని, వారిని బానిసలుగా చూస్తున్నారని విమర్శించారు. బీసీల సేవలను వాడుకొని వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఈ పార్టీల కంటే బీజేపీ బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. బీసీలకు కచ్చితంగా న్యాయం చేస్తామని అన్నారు.తాను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. తన రాజ్యసభ పదవీ కాలం ఐదేళ్లు ఉందని, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. కిషన్ రెడ్డి కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉందని, ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా.? లేదా.? అనే దానిపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రెండో జాబితా ఈ నెల 29 తర్వాత ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, రాజాసింగ్  సస్పెన్షన్, ఎన్నికల్లో పోటీ అంశాన్ని సైతం అధిష్ఠానం పరిశీలిస్తోందని వెల్లడించారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన తెలిపింది. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ తో బీజేపీ చర్చలు జరపగా ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. జనసేనతో సంప్రదింపులు జరపగా ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని టికెట్లు జనసేనకు కూడా కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్