- Advertisement -
ఏపి లో డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికితే..బూటు కాళ్ళ దెబ్బలు బూతులు
If found in drink and drive in AP.. Beat with shoes
అనంతపురం
అనంతపురం
ఏపీ వ్యాప్తంగా హై కోర్ట్ ఆదేశలతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఏ జిల్లాలో చూసిన హెల్మెట్ కచ్చితం మరియు విసృతంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అనంతపురం పట్టణంలో శుక్రవారం సాయంకాలం టవర్ క్లాక్ కూడలిలో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయారు. డ్రింక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా మాట మాట పెరిగి, డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తీ ఫై అనంతపురం ట్రాఫిక్ పోలీసులు దాడికి దిగారు. టవర్ క్లాక్ కూడలిలో అందరి ముందే డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఓ వ్యక్తీ ఫై చేయి చేసుకొని, బూటు కాళ్ళతో తంతు బూతులు తిడుతూ దాడికి దిగారు. మఫ్టిలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తు, డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వ్యక్తి కొట్టడానికి పొట్టి పడ్డారు. డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికితే బూటు కాళ్ళతో కొట్టడ్డం, బూతులు తిడుతూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న పోలీసుల వీడియోలు సోషియల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
- Advertisement -