ప్రజల దయ ఉంటే మళ్లీ గెలుస్తా
మీకు నా సాయశక్తుల సేవ చేస్తా మంత్రి కేటీఆర్
సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓట్ల కోసం ఎలక్షన్లలో ఓటర్లకు మందు పంచడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ నా జీవితంలో చేయలేదు ఇకపై కూడా చేయను మీ దయ ఉంటే ఎలక్షన్లో మళ్లీ గెలుస్తా మీకు సేవ చేస్తా ఓడిపోతే ఇంట్లో కూర్చుంటా అని కీలక వ్యాఖ్యలు చేశారు ఓట్ల కోసం వచ్చే ప్రతిపక్ష నాయకులను నిలదీయండి 50 ఏళ్లుగా చేయలేని వారు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని నిలదీయండి అని నిలదీసి ప్రజలు చైతన్యవంతులు కావాలని కోరారు పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు మర్చిపోరని కెసిఆర్ గారు సీఎంగా ఉన్నంతకాలం మన రాష్ట్రానికి ఏం డోకా లేదని సీఎం గారి పాలన సంక్షేమానికి స్వర్ణ యుగంగా మారిందని కేటీఆర్ గారు పేర్కొన్నారు అట్టడుగు వర్గాల వారి అభివృద్ధి పథంలో నడిపించడమేబిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని దానికోసమే బీసీ బందు దళిత బంధు లాంటి ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు