Thursday, April 16, 2026

స్టీల్ ప్లాంట్ కు హాని జరిగితే ఊరుకోం

- Advertisement -

స్టీల్ ప్లాంట్ కు హాని జరిగితే ఊరుకోం

If there is damage to the steel plant, we don't be calm

రాహుల్ గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదు
షర్మిల

ఖమ్మం జిల్లా
విజయవాడ
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ పై సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి పాల్గోన్నారు.  విశాఖ స్టీల్ పై చంద్రబాబు గతంలో లేఖ రాసి ఇచ్చారు.  స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తాం అని సంతకం పెట్టారు.  ఇప్పుడు ప్లాంట్ కోసం రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది.  వైజాగ్ స్టీల్ పై బీజేపీ మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు.
స్టీల్ ప్లాంట్ పై కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తుంది అని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అంటున్నారు.  ఉక్కు శాఖ మంత్రిని అడుగుతున్నాం. ఎవరివి చిల్లర రాజకీయాలు.  ఎవరి హయంలో ప్లాంట్ లాభాల్లో ఉంది ?  అదానీ,అంబానీ కన్ను విశాఖ స్టీల్ మీద పడింది. చిల్లర రాజకీయాలు మీవి. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది.  విశాఖ స్టీల్ మన రాష్ట్రానికి తలమానికం.  కాంగ్రెస్ హయంలో ప్లాంట్ నెలకొల్పారు. ప్లాంట్ కి హాని జరిగితే ఊరుకోమని అన్నారు.
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత పవన్ కి లేదు. అధికారం వచ్చాక పవన్ వేషం,భాష రెండు మారాయి.  ఉన్నత మైన హోదాలో ఉన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.  అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది.  అలాంటి మీరు ఒక మతమే ముఖ్యం అని వ్యవహరిస్తున్నారు. – బీజేపీ వాళ్ల సిద్ధాంతమే మత రాజకీయం.  గోద్రా అల్లర్లు జరుగుతుంటే ఎక్కడ పోయారు ?  రాహుల్ గాంధీ ప్రేమను పంచుతున్నారు.  అన్ని మతాలను సమానంగా చూస్తున్నారని అన్నారు.
తిరుపతి లడ్డూ వ్యవహారంలో – స్పెషల్ సిట్ వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. – లడ్డూ కల్తీ పై మొదటగా సీబీఐ విచారణ మేమే అడిగాం.  సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరాం.  ఇండిపెండెంట్ సిట్ తోనే విచారణ వేగవంతం అవుతుంది.  లడ్డూ కల్తీ పై రాజకీయాలు చేయొద్దని సుప్రీం చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నమని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్