
ప్రజలు ఈసారి అలోచించి బీజేపీకి ఓటు వేయాలి
మంథని నియోజకవర్గం అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
మంథని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని: ప్రజలు ఈసారి అలోచించి బీజేపీకి ఓటు వేసి తను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంథని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం రామగిరి మండలం గడ్డం పల్లి,సుందిళ్ల, పెద్దంపేట, సింగిరెడ్డి పల్లి గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంథని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామ్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ పెద్దంపేట,సింగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు అర్హులైన వారికి ఆర్&ఆర్ ప్యాకెజ్ ఇప్పియడంలో జడ్పీ చైర్మన్ గా ఉన్న పుట్ట మధుకర్,ఎమ్మెల్యే గా ఉన్న శ్రీధర్ బాబు ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. బిఆరెస్,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలకె ఆర్&అండ్ ప్యాకెజి లు అని దళిత బందు,గృహలక్ష్మి,డబుల్ బెడ్ రూమ్ పథకాలు ఇస్తామని ప్రజలను ఈ బిఆరెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.ప్రజలు ఈ సారి అలోచించి… ఓటు వేయాలి.మళ్ళీ కాంగ్రెస్,బిఆరెస్ ని నమ్మితే మోసపోయే అవకాశం ఉందని,మంథని నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమన్నారు.ఈ సారి మంథని నియోజకవర్గంలో ప్రజలు సరికొత్త మార్పు కోరుకుంటున్నారని ఈ ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి మంథని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మంథని ఎమ్మెల్యే గా గెలిపియాలని సునీల్ రెడ్డి ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళా నాయకురాలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.