ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు
If you have self-confidence you can achieve anything
రిసోర్స్ పర్సన్ హరికుమార్ వెల్లడి
పిడుగురాళ్ల,
ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా స్థానిక మండల పరిషత్ ఆవరణలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఐ.యి.రీసోర్స్ పర్సన్ మారం.అజిత్ కుమార్ మాట్లాడుతూ, మానసిక సామర్థ్యానికి వైకల్యం అడ్డుకాదని, ఆత్మ విశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని,అంధుడై అంధుల కోసం ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానానికి అనుగుణంగా బ్రెయిలీ లిపిని రూపొందించిన ఘనుడు లూయిస్ బ్రెయిలీ అని అన్నారు. భారత దేశం ఆయన గౌరవార్థం రెండు రూపాయల నాణేలను, అమెరికా డాలర్ నాణేలను విడుదల చేయడం అపూర్వం అన్నారు. రీసోర్స్ పర్సన్ హరి కుమార్ మాట్లాడుతూ, ఈ ప్రపంచంలోని అంధులందరికి తన బ్రెయిలీ లిపితో అక్షర జ్ఞానాన్ని ప్రసాదించి, వారిలో ఎంతోమందిని శాస్త్రవేత్తలుగా, సంగీత కళాకారులుగ, పత్రికాధిపతులుగా, చిత్రకారులుగా ఇలా అనేక రంగాల్లో అగ్రభాగాన నిలిచేట్లు చేశారన్నారు. తదుపరి ర్యాలీ నిర్వహించి, పిల్లలకు బిస్కెట్లు, లడ్డు,బూందీలు పంచారు. ఈకార్యక్రమంలో మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.