Sunday, September 8, 2024

ఖాళీగా కనిపిస్తే కబ్జా….!

- Advertisement -

ఖాళీగా కనిపిస్తే కబ్జా….!
పచ్చని కొండలో గుడిసెలు..!
ఆక్రమణలను అడ్డుకున్న స్థానికులు
స్థానికులు.. స్థానికేతరుల మధ్య కర్రలు, రాళ్లతో దాడులు
ఆక్రమణల వెనుక ఉన్న నాయకుడెవ్వరు..?
బద్వేలు

If you see it empty, take possession…!

అక్కడ ఎటుచూసినా, ఏ కొండ,గుట్ట, వాగు,వంక చూసిన నిత్యం ఏదో ఒక మూల భూ కబ్జాలు పెచ్చుమీరి పోతున్నాయి. కొండలేదు,గుట్టలేదు, వంకైనా,వాగైనా,మోరీలైన, చెరువైనా, చివరకు మురికికాలువైన ఆక్రమణదారుల కబందహస్తాల మధ్య బందీగా మారి పోతున్నాయి. రాత్రికి రాత్రే పచ్చని కొండలు సైతం తొలచి గుడిసెలు వేస్తున్నారు. అక్రమంగా గుడిసెలు వేస్తున్నా అధికారులలో చలనం రాక పోవడానికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారుల లంచగొండి తనమే అని చెప్పవచ్చు. అదెక్కడో చూద్దామా.. కడప జిల్లా బద్వేలు కు వెళ్లాల్సిందే. బద్వేలు రెవెన్యూ డివిజన్ లో మరోసారి రెవెన్యూ అధికారుల బాగోతం బట్టబయలు అవుతోంది. గోపవరం మండల తహశీల్దారు కార్యాలయానికి కూతవేటు దూరంలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతాల నుండి వచ్చిన స్థానికేతరులు అక్రమం గా గుడిసెలు వేస్తున్నా రెవెన్యూ అధికారులు నోటి పెదాలు కదిలించిన పాపాన పోలేదు. పిపికుంట-శ్రీనివాసపురం దగ్గర సర్వే నెంబర్ 623,624 లలో అక్రమ గుడిసెలు వేశారు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే రెవెన్యూ అధికారుల కంటమాత్రం పడలేదంటే ఆశ్చర్యం కలిగిస్తోంది.
గుడిసెలు వెనుక ఓ నాయకుడి హస్తం.
బద్వేలు, గోపవరం మండలాలకు సంబంధించిన స్థానికులు కాకుండా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ప్రాంతాల నుండి దాదాపు 300 మందికి పైగా ధైర్యంగా కొండ గట్టు పైన గుడిసెలు వేసే దైర్యం వెనుక బద్వేలు ప్రాంతానికి చెందిన ఓ ప్రజా నాయకుడి అండదండలు పుష్క లంగా ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కానీ ఆ ప్రజానాయకుడు ఎవరనేది అంతు బట్టడంలేదు.ఇంతకీ ఆ ప్రజానాయకుడు ఎవరు, ఏమి చేస్తుంటారు అనేది ప్రశ్నగా మారింది.
స్థానికులు ఇద్దరు స్థానికేతరులు వందకు పైగా గుడిసెలు వేయడంలో స్థానికంగా గాండ్ల వీధికి చెందిన ఇద్దరు మాత్రమే నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతాల నుండి వందల మందిని రప్పించి గుడిసెలు వేయించి, వారి ద్వారా భూమి కబ్జా చేయాలనే ఆలోచనతో చేయించినట్లు బహిరంగ చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు ఎవరు అనేది రెవెన్యూ అధికారులకే ఎరుక.
రెవెన్యూ అధికారులకు చలనం లేదు..స్పందించిన స్థానికులు
గోపవరం తహశీల్దార్ కార్యాలయం కు కూతవేటు దూరంలో 10 రోజుల నుండి వందల మంది తిరుణాలకు వచ్చినట్లు వచ్చి కొండ గుట్ట అంతా చెట్లు నరికి గత పది రోజులుగా అక్రమ గుడిసెలు వేస్తున్నా రెవెన్యూ శాఖ అధికారులకు  కనిపించక పోవడంతో స్థానికులైన శ్రీనివాసపురం గ్రామస్తులు మూకుమ్మడిగా వెళ్లి అక్రమంగా గుడిసెలు వేస్తున్న వారి గుడిసెలు తగలబెట్టారు.
యుద్దం లా జరిగిన ఘర్షణ
గోపవరం మండలం పరిధిలోని 1623, 1624  సర్వే నెంబర్లలో అక్రమ గుడిసెల ను శ్రీనివాసపురం వాసులు కాల్చడంతో స్థానికులు, స్థానికేతరుల మధ్య మొదట మాటల యుద్ధం ఆతర్వాత కట్టెలు, రాళ్ళ తో యుద్దవాతావరణం తలపించేలా కొట్టుకున్నారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిద్రలేచిన రెవెన్యూ, పోలీసు యంత్రాంగం
శ్రీనివాసపురం వాసులకు అక్రమంగా గుడిసెలు వేసిన స్థానికేతరుల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలుసు కున్న మన రెవెన్యూ, పోలీసు సార్లు ఆఘమేఘాల మీద అక్కడికి వచ్చి రెండు దెబ్బలు ఇరువర్గాలపై వేసి చెదరగొట్టి జేసిబి తెచ్చి గుడిసెలను కూలగొట్టారు.అనంతరం ఇరువర్గాల ను పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఇదే పని ముందే చేసి ఉంటే…
అక్రమంగా గుడిసెలు వేయకముందే రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చేసి ఉండి ఉంటే ఇంత ఘర్షణ లు జరిగేవి కాదుకదా అని ప్రజలు  విమర్శనాస్త్రాలు  సందిస్తున్నారు. ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి ఆక్రమణలపై దృష్టి సారించి ఘర్షణ లు చెలరేగకుండా చూస్తారా లేక మాది కాదులే అనే సూత్రంతో కార్యాలయాలకే పరిమితం అవుతారో వేచి చూడాల్సిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్