ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు పండ్రంగి లక్ష్మి సుకన్య
భద్రాచలం నవంబర్ 25: భద్రాచలం బిజెపి అభ్యర్థి కుంజా ధర్మా రావును గెలిపించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు పండ్రంగి లక్ష్మి సుకన్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.బిజెపి కి ఓటు వేయాలని,ఓటు వేస్తె కలేగే లాబాలను ప్రజలకు వివరించారు. లక్ష్మి సుకన్య మాటలు విశ్వసించి శనివారం 180 మంది దుమ్ముగూడెం మండలం గుర్రాలుబైలు 50 కుటుంబాలు, దుమ్ముగూడెం మండలం వచ్చి కె. నారాయణరావుపేట 50 కుటుంబాలు , దుమ్ముగూడెం మండలం పౌలూరిపేటగ్రామం 80 కుటుంబాలు బిజెపి పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా లక్ష్మి సుకన్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే అది బి ఆర్ ఎస్ అకౌంట్ లొకే వెళ్తుందని, వాళ్ళు సంతలో పశువుల కన్న హీనంగా అమ్ముడు పోతారని అన్నారు. అంతే కాకుండా బిజెపి పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో రైతులకు బరోసా కల్పిస్తూ రైతులకు వరి మద్దతు ధర 3100 రూపాయలు, ఎరువులు విత్తనాల కొనుగోలు కోసం రూ.2500 సహాయం,అర్హత గల కుటుంబాలకు 10లక్షల ఉచిత ఆరోగ్య బీమా, పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గింపు,మహిళలకు ఒక శాతానికి వడ్డీ రుణాలు, ప్రతి ఆరు నెలల ఒకసారి టీఎస్పిఎస్సీ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లు,అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు పంపిణీ, అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు మరియు ఇళ్లను కట్టిస్తామని చెప్పారు.ఆడబిడ్డ బరోసా కింద 21ఏళ్ల వచ్చే సరికి 2 లక్షల రూపాయల పథకాలతో పాటు ఉజ్వల లబ్ది దారులకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై విచారణకు కమిషన్ ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ధరణి స్థానంలో మీ భూమి యాప్, బిసి ని ముఖ్యమంత్రి చేస్తామని, ఎస్సి వర్గీకరణ కు సానుకూలంగా స్పందించి కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని చెప్పారు..బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.



