Sunday, September 8, 2024

మీకు ఓటెందుకు వేయాలో… చెప్పండి సార్

- Advertisement -

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు బహిరంగ లేఖ

80 ప్రశ్నలతో మంత్రిని సూటిగా ప్రశ్నించిన చుక్క గంగారెడ్డి

వెలుగులోకి అంజామాన్ బ్యాంక్ దోపిడీ, కోరుట్ల లాకప్ డెత్, భూ కబ్జాలు, కిడ్నాప్ లు, చిత్ర హింసలు

ఇథనాల్ ఇండస్ట్రీ పై మంత్రి మాయ మాటలు

పదేండ్ల పాలనలో ప్రజల కష్ట – నష్టాలు, సమస్యలపై 15 పేజీల ఉత్తరం

ఈ ప్రాంత ప్రజల ఉసురు తలుగక మానదని ఆవేదన

 ధర్మపురి, నవంబర్ 25:  మంత్రి కొప్పుల ఈశ్వర్ ను సూటిగా ప్రశ్నిస్తూ ధర్మపురి నియోజక వర్గ ప్రజలు మీకు ఇంకా కూడా ఓటెందుకు వేయాలో చెప్పాలంటూ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ ఉద్యమ కారుడు, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి శనివారం బుగ్గారం నుండి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.

నియోజక వర్గంలోని ప్రజా సమస్యలు, పదేండ్ల పాలనలో నియోజక వర్గ ప్రజలపై చిత్ర హింసలు, కుట్ర పూరిత చర్యలు, దోపిడీలు, భూ కబ్జాలు, ప్రజలకు జరిగిన అన్యాయాలు, అక్రమాలు, అక్రమ కేసులు, దాడులు – దౌర్జన్యాలు, నాణ్యత లేని అభివృద్ది పనులు, విచ్చల విడిగా నిధుల దుర్వినియోగం, వరిధాన్యం దోపిడీ, విద్య – వైద్యం లపై కొప్పుల నిర్లక్ష్యం, ఇథనాల్ ఇండస్ట్రీ, నీళ్ళ దోపిడీ, త్రాగు నీరు ఇతరత్రా సమస్యలపై 80 ప్రశ్నలతో 15 పేజీల బహిరంగ లేఖను చుక్క గంగారెడ్డి రూపొందించారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కొప్పుల ఈశ్వర్ ను చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 నుండి ధర్మపురి ఎమ్మెల్యే గా నాలుగు సార్లు గెలిచి, ప్రభుత్వ చీఫ్ విప్ గా, మంత్రిగా ఉండి కూడా కొప్పుల ఈశ్వర్ నియోజక వర్గ ప్రజలకు తీరని అన్యాయం చేశాడు తప్పా మేలు చేసిన దాఖలాలు లేవని అన్నారు. దొంగలను, దోపిడీ దారులను, మాఫియాను, స్మగ్లర్లను, భూ కబ్జా దారులను పెంచి పోషించాడని ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్ అండదండలతోనే ధర్మపురి నియోజక వర్గంలోని ప్రజలకు అనేక రకాలుగా ముప్పు వాటిల్లిందని అన్నారు. అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, దాడులు – దౌర్జన్యాలు, భూ కబ్జాలు,  దుర్వినియోగాలు, హత్యలు, మోసాలు, విచ్చల విడిగా పెరిగి పోయాయని అన్నారు. గ్రామాలలో పంచాయతీల పేరుతో కూడా బిఆర్ఎస్ నేతలు అక్రమంగా, అన్యాయంగా దోచుకున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను కూడా అర్హత లేని బిఆర్ఎస్ కార్యకర్తలకు, వారి అనుచరులకు కట్టబెట్టారు తప్ప నిజంగా అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాలు తీసైన ఇథనాల్ ఇండస్ట్రీ కట్టి తీరుతాం అన్న దృడ సంకల్పంతో స్థంభంపల్లి, పాషిగామ ఇతరత్రా గ్రామాల ప్రజలపై మంత్రి కొప్పుల ఈశ్వర్  చిత్రహింసలు చేయించారని అన్నారు.

నేడు మాట మార్చి ఓట్ల రాజకీయం చేస్తూ నా ప్రాణం ఉన్నంత వరకు ఇథనాల్ ఇండస్ట్రీ కట్టనీయనని కొప్పుల ఈశ్వర్ మోసపూరిత మాటలతో ప్రజలను మరోసారి మోసం చేసి ఓట్లు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వాపోయారు.

2013 డిసెంబర్ లో జరిగిన

ధర్మపురి అంజమాన్ బ్యాంక్ (పిఎసిఎస్) దొంగ తనం, అసలైన దొంగలను పట్టి సొత్తు రికవరీ చేయక పోవడం, కోరుట్ల లాకప్ డెత్ లో  బుగ్గారంకు చెందిన సాన చంద్రయ్య హత్య, బిబి రాజ్ పల్లిలో యువకుని కిడ్నాప్, తుపాకీతో బెదిరింపులు, ఒక ఎస్సీ యువకుని పై సాక్షాత్తు మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మ దిన వేడుకల్లోనే భౌతిక దాడి, బుగ్గారం జీపిలో కోటికి పైగా నిధులు దుర్వినియోగం, లక్షల్లో రికవరీ అయినా సర్పంచ్ సస్పెండ్ కాకపోవడం, అక్రమ కేసులు పెట్టడం, దళిత బిడ్డలను మోసాలకు గురి చేయడం,

రాయపట్నం తో సహా నియోజక వర్గంలోని ఏడు మండలాలలో గల భూ కబ్జాలు, ఇసుక మాఫియా, అధికారుల బదిలీలకు భారీగా చేతి వాటాలు  ఇతరత్రా ప్రధాన సమస్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా బాధ్యుడని చెబుతూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. కొప్పుల ఈశ్వర్ పరిపాలన కాలమంతా దొంగలు, దోపిడీ దారులు, రౌడీలు, గుండాలు రాజ్యం ఏలారని, వారికే ఈ ఈశ్వరుడు పట్టం కట్టి ప్రజలను వేదించెందుకు పరోక్షంగా సహకరించాని ఆవేదన వెలిబుచ్చారు.

ఇంతటి నేరాలు – ఘోరాలు చేయించి కూడా

ఇంకా ఏమి మొఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడగడానికి వస్తున్నావని మంత్రి కొప్పుల ఈశ్వర్ ను చుక్క గంగారెడ్డి సూటిగా ప్రశ్నించారు.

ధర్మపురి నియోజక వర్గ ప్రజలు కొప్పుల ఈశ్వర్ కు తగిన బుద్ది చెప్పడానికి ఎప్పుడో సిద్ధమై అవకాశం కోసమే వేసి చూశారని అన్నారు. ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి కొప్పుల ఈశ్వర్ ను తన ఇంటి దొంగల ద్వారానే వీడ్కోలు చెప్పించి సాగనంపే రోజు వచ్చిందన్నారు. ధర్మపురి ప్రజలు గత 14 ఏండ్లుగా అనుభవించిన బాధలు, కష్టాలు, నష్టాలు, ఇతరత్రా అన్ని కూడా కొప్పుల ఈశ్వర్ కు, అతని అనుచరుల కు శాపాలుగా మారాయని అన్నారు. వాటన్నిటికీ తగిన విధంగా ఈ నియోజక వర్గ ప్రజల ఉసురు తలుగక మానదు అని చుక్క గంగారెడ్డి హితవు పలికారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్