Sunday, September 8, 2024

గాడ్ సైకో థ్రిల్లర్ సినిమా చూడాలంటే – ‘ఓహ్ గాడ్’ అనాల్సిందే

- Advertisement -

నయన తార, జయం రవి ప్రధాన పత్రాధారుల గా నటించిన తమిళ్ హిట్ మూవీ ఇరైవన్ తెలుగు వెర్షన్ ఈ గాడ్ సినిమా.    (నెట్ ఫ్లిక్స్ ఓటీటీ)

సైకో థ్రిల్లర్ సినిమా గాడ్ కధ లోకి వస్తే, నగరం లో వరుసగా ఆడపిల్లల హత్యలు అతి క్రూరం గా జరుగుతుంటాయి.

అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ – అర్జున్ (జయం రవి ), స్ట్రిక్ట్  అధికారి. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే వ్యక్తి – ఎక్కడ క్రిమినల్ కనపడినా కాల్చేస్తుంటాడు. భయం అనేది తెలీదు. తనకంటూ ఎవ్వరూ లేని, అర్జున్ – తన కొలీగ్ అయిన మరో ఏసీపీ – ఆండ్రు కుటుంబాన్ని తన సొంత మనుషుల్లా చూసుకుంటూ ఉంటాడు.

if-you-want-to-watch-god-psycho-thriller-movie-you-have-to-say-oh-god
if-you-want-to-watch-god-psycho-thriller-movie-you-have-to-say-oh-god

ఈ వరుస హత్యలు చెస్తున్న  బ్రహ్మ (రాహుల్ బోస్ )ని చివరకు పట్టుకుని అరెస్ట్ చేస్తారు. ఈ అరెస్ట్ క్రమం లో, సైకో కిల్లర్ బ్రహ్మ అర్జున్ ఫ్రెండ్ అయిన ఆండ్రు ని హత్య చేస్తాడు.

ఈ పరిస్థితుల్లో, అర్జున్ తన జాబ్ కి రిజైన్ చేసి, కాఫీ షాపు ని స్టార్ట్ చేస్తాడు.

కానీ, పోలీస్ కస్టడీ లో బ్రహ్మ ఉన్నప్పుడు కూడా, నగరం లో ఆడపిల్లల హత్యలు ఆగవు.

తర్వాత – బ్రహ్మ పోలీస్ కస్టడి నుండి తప్పించుకుని,  నగరం లో 25 సంవత్సరాల ఆడ పిల్లల ని మరల క్రూరం గా హత్యలు చేస్తాడు. కాకపోతే – ఈ సారి అర్జున్ కి క్లోజ్ గా ఉండే ఆడపిల్లలు హత్య లకి గురవుతారు.

ఈ సిట్యుయేషన్ లో, అర్జున్ బ్రహ్మ ని కనిపెట్టి, పట్టుకుంటాడా, అస్సలు, బ్రహ్మ జైల్లో ఉన్నప్పుడు కూడా హత్యలు చేసింది ఎవరు? అస్సలు నిజమైన హంతకుడు ఎవరు?

ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ కావాలంటే, ఒరిజినల్ తమిళ్ మూవీ ఇరైవన్ తెలుగు డబ్బింగ్ సినిమా గాడ్ చూడాల్సిందే.

సైకో థ్రిల్లర్ సినిమా లు ఎన్నోచ్చినా, ప్రేక్షకులు ప్రేమించేది, ఈ సినిమా ల్లో చివరి వరకూ మైంటైన్ చేసే సస్పెన్సు ని, గ్రిప్పింగ్ గా ఉండే స్క్రిప్ట్ నీ, ప్రేక్షకులను కధ లో లీనం చేసే విధానాన్ని. ఈ ఫ్యాక్టర్స్ లో, గాడ్ సినిమా డైరెక్టర్ – ఐ. అహ్మద్ – హత్యలు చేసేదేవరో సెకండ్ ఆఫ్ లో రివీల్ చేసిన పాయింట్ కొంచెం కొత్తగా ఉంది. సినిమా నిడివి తగ్గించి, కధ ని ఇంకొంచం స్పీడ్ గా నడిపించుంటే, ఈ సినిమా ఇంకా బాగా వచ్చేది.

అయినప్పటికీ, యువన్ శంకర్ రాజా బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా కి బాలాన్నిచి సీన్లు చూసేటప్పుడు కధ లో లీనం అయేట్లు చేస్తుంది. ఫోటోగ్రఫీ విషయం లో కూడా, సస్పెన్సు థ్రిల్లర్ సినిమ్మాలో కావాల్సిన సీనిక్ మూడ్స్ ని క్రియేట్ చేయడం లో,

డి. ఓ. పీ – హరి కే వేదాంతం సక్సెస్ అయ్యాడు.

ఇక పాత్ర ల విషయానికి వస్తే, భయం అంటే తెలీని పోలీస్ ఆఫీసర్ పాత్ర లో జయం రవి జీవించాడని చెప్పొచ్చు. తన ముఖ కవళిలకలతో, చూపులతోనే సినిమా అంతా ఒకే టెంపో మైంటైన్ చేశాడు. ఎడిటర్ మోహన్ ఇద్దరు కుమారుల్లో ఒకరు డైరెక్టర్ మోహన్ రాజా (చిరంజీవి గాడ్ ఫాదర్ డైరెక్టర్ ), రెండవ కుమారుడు – ఈ హీరో రవి – తన అన్నయ్య మోహన్ రాజా డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ తమిళ్ సినిమా జయం తో, ‘జయం రవి’ గా పాపులర్ అయ్యాడు. ఆరడుగుల జెన్యూన్ హీరో లుక్స్ తో ఈ సినిమా మొత్తాన్ని తనే మోశాడు అని చెప్పొచ్చు.

ఇంకో పోలీస్ ఆఫీసర్ – ఆండ్రు సోదరి గా నయన తార యాక్ట్ చేసింది – కధ లో ఇంపాక్ట్ ఏమీ లేని పాత్ర – ఒక లేడీ ఓరియెంటెడ్ పాత్ర లకు ఫేమస్ అయిన నయన తార, ఈ పాత్ర ఎందుకు చేసిందో అర్ధం కాదు.

ఇక మిగిలిన పాత్ర ల్లో, నరేన్, నరేన్ కిషన్, రాహుల్ బోస్, విజయలక్ష్మి, ఆశిష్ విద్యార్థి వాళ్ళ, వాళ్ల క్యారెక్టర్స్ లో చక్కగా ఒదిగి పోయారు.

డైరెక్టర్ ఆడపిల్లల హత్యలు చూపించ డంలో చూపించిన నేర్పు, ఇంకొంచం ఫాస్ట్ గా సీన్లు ఉండేట్లు స్క్రిప్ట్ రాసుకుని, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని మరింత టెంపో తో చూపించుంటే ఈ గాడ్ కధ ఇంకా పండేది.

మొత్తం మీద గాడ్ సినిమా, సైకో థ్రిల్లర్ సినిమా లు నచ్చిన ప్రేక్షకులు కు కను విందు చేస్తుంది.

గాడ్ తెలుగు వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది   – సత్య కేశరాజు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్