Sunday, September 8, 2024

విద్యార్ధి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి

- Advertisement -

హెచ్.సి.యు.లో ఎస్ఎఫ్ఐ విద్యార్ధి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి
– నియంతృత్వ పోకడలు అవలంభిస్తున్న వి.సి
– విద్యార్ధులపై కేసులు పెట్టి, మరుసటి రోజు సస్పెన్షన్ విధించిన వి.సి
– సమస్యలపై ప్రశ్నిస్తే వెలివేస్తారా?

– సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు

ఖమ్మం:

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీ (హెచ్.సి.యు.) లో ఎస్ఎఫ్ఐ నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులను, విధించిన సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని, వైస్ – ఛాన్సలర్ నియంతృత్వ పోకడలతో విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందని తక్షణమే వి.సి. తీసుకున్న నిర్ణయ వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా స్థానిక ఆర్ అండ్ బి కార్యాలయం వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.సుధాకర్ అధ్యక్షతన జరిగిన నిరసన సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లడుతూ విద్యార్ధులు హక్కులు తెలియజేయడానికి విద్యార్ధులు ఎన్నుకున్న యూనివర్శీటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు అతీక్ అహ్మద్, మరియు ఎస్ఎఫ్ఐ యూనిట్ కార్యదర్శి కృపా జార్జ్ వీరీతో  పాటు మరో  08 మంది విద్యార్థులు 6 నెలలు సస్పెన్షన్, పదివేల రూపాయలు ఫైన్ విధించడం అడ్మిన్ చర్యలు విద్యార్ధుల చదువులకు నష్టం కల్గించే చర్యలు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. సస్పెన్షన్ చేసిన విద్యార్థులు అట్టడుగున ఉన్న నిరుపేద సామాజిక నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారని ,విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్ధులను సస్పెన్షన్ చేయడం కాకుండా, వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ యూనివర్శీటీలో 8 యేండ్లు క్రితం రోహిత్ వేముల కూడా ఇదే రకంగా సస్పెన్షన్ గురి చేసి హత్య చేసిందని తెలిపారు. తక్షణమే విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ రద్దు చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని, ఛలో హెచ్.సి.యు. కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్ మాట్లడుతూ హైదరాబాద్ యూనివర్శీటీ విద్యార్ధి నాయకులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసి న్యాయం చేయాలని, వారికి మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్, రాజు, వెంకటేష్, సహాయ కార్యదర్శి సి.హెచ్.వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు పి.నాగరాజు, వరుణ్, ఉమేష్, హారీష్, వెంకట్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్