Sunday, February 9, 2025

అశ్వాపురంలో అక్రమ మద్యం దంతాను “భద్రంగా”చూసుకుంటా,మమ్మల్ని అడిగేది ఎవ్వరు…

- Advertisement -

అశ్వాపురంలో అక్రమ మద్యం దంతాను “భద్రంగా”చూసుకుంటా,మమ్మల్ని అడిగేది ఎవ్వరు…

Illegal liquor in Ashwapuram is kept 'safe', no one asks us...

 లైసెన్సు గిరిజనుల పేరు మీద

సొమ్ములు దోచుకునేది గిరిజనేతరులు

మధ్యంలో  కల్తీ కూడా జరుగుతుందని  అనుమానాలు.

మా బెల్ట్ షాపులు మా ఇష్టం అంటున్న అశ్వాపురం మద్యం  సిండికేట్ మాఫియా

భద్రాద్రి కొత్తగూడెం

అశ్వాపురం మండలంలో  మద్యం సిండికేట్ నాది  మద్యం సిండికేట్ ఆఫీసును బెల్ట్ షాపులను అంతా” భద్రం ” గా చూసుకుంటా అంటున్న వ్యక్తి.
అశ్వాపురం మండలంలో ప్రభుత్వ అనుమతులు పొందిన మద్యం షాపులకు సమయంతో పనిలేదు, అంతా వారి ఇష్టం?
గత పది రోజుల నుంచి అశ్వాపురం మండలంలో బెల్ట్ షాపులపై జరుగుతున్న కార్యక్రమాలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు? అందుకు కారణం ఏమిటి?
దళిత సంఘాల నాయకులు టెంట్లు వేసిన, రిలే నిరాహార దీక్షలు చేసిన సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదు దళిత సంఘాలు అంటే చిన్న చూపా? లేదంటే బెల్ట్ షాపులకు  పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారా అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళితే…..
అశ్వాపురం మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ ఆసుపత్రి ముందు దేవాలయం పక్కన ఒక ఇంటిని  సిండికేట్ ఆఫీస్ గా చేసుకోని బల్క్ లో బెల్ట్ షాపులకు సమయం సందర్భం లేకుండా  విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్నారు.
మద్యం షాపు యజమానులు బెల్టు షాపుల నిర్వాహకులతో చేతులు కలిపి వారికి సహకరిస్తున్నారు. ఒక్కో సీసాపై అదనంగా 20 రూపాయల చొప్పున తీసుకుని కావాల్సినవన్నీ అందిస్తున్నారు. బెల్టు షాపులవారు వాటిని గ్రామాలకు తీసుకెళ్లి.. ఆ రేటుపై అదనంగా మరో 30 నుంచి 40 రూపాయలు వసూలు చేసి మందుబాబులకు అమ్ముతున్నారు. మద్యం దుకాణాల్లో  160 రూపాయలు ఉండే బీరు సీసా.. బెల్టు షాపుల్లో 250 రూపాయలకు విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఈ రేటు ఇంకా పెరుగుతుంది. ఈ మద్యం దందా పై తక్షణమే ఎక్సైజ్ అధికారులు స్పందించి  కట్టడి చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

గ్రామాల్లో ఎనీ టైం మద్యం

పట్టణ ప్రాంతాల్లో రాత్రి సమయంలో మద్యం దొరకదు కానీ మండల కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్య రాత్రి అయినా బెల్ట్ షాపు తలుపు తడితే చాలు ఏటీఎం లాగా కావలసిన మద్యం ప్రత్యక్షమం అవుతుంది. ధర ఎంతైనా పర్వాలేదు అన్నట్లు మద్యం ప్రియుల వ్యవహారం ఉంది. ఏది ఏమైనా గ్రామాల్లో బిచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వాహకంతో ప్రధానంగా యువత పెడదారిలో ప్రయాణిస్తోంది. ఎంతో విలువైన తమ భవిష్యత్తును అభాసుపాలు చేసుకుంటున్నారు. గ్రామాల్లో మధ్య రాత్రి మద్యం అమ్మకాలు చేయడం వలన యువత మత్తులో ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చు…

విచ్చలవిడిగా గ్రామాల్లో దొరుకుతున్న మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చి పెడుతోంది. ఊరూరా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల వెలుస్తున్నాయి. దీంతో పొద్దంతా పనిచేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వేచిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటంతో యువత పెడదారి పడుతోంది. ఎక్సైజ్ అధికారులు మాముళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆటోలలో లక్షలు విలువ చేసే మద్యం స్టాకు తీసుకొని వచ్చే సెలవ దినాల్లో ఎలాంటి భక్తి భయం లేకుండా మద్యం విక్రయాలను సాగిస్తున్నారు. ఇదంతా సాగుతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరించడం పట్ల మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్